కళ్లను చూసి..


Mon,December 17, 2018 01:40 AM

డయాబెటిక్ రోగులకు శుభవార్త. ఎలాంటి పరీక్షలు లేకుండా మీ కళ్లను చూసి వ్యాధిని నిర్ధారించే టెక్నాలజీ అందుబాటులో రాబోతున్నది. అతి త్వరలోనే దీనిని మన దేశానికి అందించేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రయత్నిస్తున్నది.
Sugar-news
ప్రపంచంలో దాదాపు 40 కోట్ల మంది డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో మూడొంతుల మందికి డయాబెటిక్ రెటినోపతి సమస్య ఉంది. ఈ సమస్య ఉన్నవారిలో కొద్దికొద్దిగా చూపు తగ్గిపోయి, కొంతకాలానికి పూర్తిగా చూపు కోల్పోతారు. ఈ సమస్యకు పరిష్కారంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మనిషి కంటిని చూసి.. అతనికొచ్చిన రోగం ఎంటో పక్కాగా లెక్కకట్టిచెప్పేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా డయాబెటిక్ తేలికగా గుర్తించేందుకు వీలుగా డయాబెటిక్ రెటినోపతి ఏఐని ఆవిష్కరించే పనిలో బిజీగా ఉంది గూగుల్. మనిషి కళ్లను చూసి కంటి వైద్యుల కంటే పక్కాగా షుగర్ స్థాయిని చెప్పేస్తుంది. త్వరలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాబెటిక్ రెటినోపతీ ఆవిష్కరణాన్ని భారతదేశంలోని క్లినిక్స్‌కు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

349
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles