కలవరపెట్టే కండరాల నొప్పి


Wed,July 27, 2016 01:10 AM

కండరాలనొప్పిని వైద్యపరిభాషలో ఫైబ్రోమయాల్జియా అంటారు. ప్రైమరీ ఫైబ్రోమయాల్జియాలో వేరే కారణాలుండవు. కాని సెకండరీ ఫైబ్రోమయాల్జియాలో కండరాలనొప్పికి ఇతర వ్యాధులు కారణాలవుతాయి.
లక్షణాలు
కండరాలు కుదించుకుపోయినట్టు అనిపించడం, కొంకర్లు పోవడం, నిద్ర లేచిన తరువాత అలసట, నీరసం, నిస్సత్తువ, కండరాల నొప్పి, మెడ, వెన్ను, భుజాలు మొదలైనవి సున్నితంగా ఉండడం, నిద్రలేమి, ఉదయం లేచిన వెంటనే కండరాలు బిగుతుగా ఉండడం, ఆందోళన, తలనొప్పి, తలతిరుగుతున్నట్టుండడం, విరేచనాలు లేదా మలబద్దకం.
కారణాలు
రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, అడ్రినల్ సమస్యలు, శరీరంలో కాల్షియం నిల్వలు తక్కువ ఉండడం, న్యూరోపతి, డయాబెటిస్, నిర్ధారణ పరీక్షలు, సీబీపీ, ఈఎస్‌ఆర్, టి3, టి4, టిఎస్‌హెచ్, సీరమ్ కాల్షియం, ఆర్‌బిఎస్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, అడ్రినల్ గ్రంథి పరీక్షలు, స్లీప్ అప్నియా పరీక్షలు.
హోమియో చికిత్స
బ్రయోనియా : శరీరంలో ఉండే అన్ని కండరాలు నొప్పిగా ఉంటాయి. నొప్పి గుచ్చినట్టు, చిరిగినట్టుంటుంది. కదలికలకు ఎక్కువవుతుంది. దాహం ఎక్కువ. సమస్యలు కుడిపక్క ఎక్కువగా ఉంటాయి. చిరాకు ఉంటుంది. మలబద్దకం, వేడిని భరించలేకపోవడం వంటి లక్షణాలుంటే వాడాలి.
రస్టాక్స్ : అధిక శ్రమ, అధిక బరువులెత్తడం వంటి పనుల తరువాత వచ్చే సమస్యలకు మంచి మందు. ముఖ్యంగా కీళ్లు, కండరాల మీద బాగా పనిచేస్తుంది. కీళ్లవాపు, నొప్పి, చల్లగాలిని భరించలేరు. కాళ్లు పట్టినట్లు ఉంటాయి. సయాటికా, కుదురుగా ఒకచోట కూర్చోలేరు. నిరంతరం కదులుతుంటారు. తిమ్మిర్లుంటాయి. శ్రద్ధ, ఉత్సాహం లేకుండా ఆత్మహత్య ఆలోచనలతో ఉంటారు. రాత్రివేళ ఆందోళ ఎక్కువ. తేమ వాతావరణంలో సమస్యలు అధికంగా ఉంటాయి.
కాల్చికమ్ : కండరాలు, కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే పొరల మీద మంచి ప్రభావం చూపిస్తుంది. వాతరోగ తత్వం కలవారికి, కీళ్లనొప్పి, వాపు, అధిక నీరసం, శరీరంలోపల చల్లగా ఉండడం, రాత్రి ఎక్కువసేపు మెలకువలగా ఉండడం, చేతులు, కాళ్లకు పిన్నులతో గుచ్చినట్టుండడం, తిమ్మిర్లు, కీళ్లు పట్టినట్టుండడం, స్పర్శకి సున్నితంగా ఉంటారు. వీరికి ఆహారం వాసనకు ముఖ్యంగా చేప వాసనకు వికారం వస్తుంది. నడుము నొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలుంటే బాగా పనిచేస్తుంది.
ఫార్మికా రూఫా : వాతరోగం ఉన్నవారికి మంచి మందు. కీళ్లు పట్టినట్టుండడం, కదలికలు కష్టంగా ఉండడం, కుడిపక్క సమస్యలు అధికంగా ఉండడం, మలబద్దకం, మలవిసర్జనకు ముందు బొడ్డుచుట్టూ నొప్పి, కండరాలు అలసినట్టు వాటి స్థానం నుంచి విడిపోయినట్టు అనిపించడం, నీరసం, నొప్పులు గుచ్చినట్టుండడం వంటి లక్షణాలుంటాయి. వీరు చల్లని వాతావరణాన్ని తట్టుకోలేరు. వెచ్చని వాతావరణంలో, ఒత్తిడికి ఉపశమనం ఉంటుంది.
కాల్మియా : ర్యుమాటిక్ సమస్యలకు మంచి మందు. నరాల నొప్పి, శరీరం పై భాగం నుంచి కింది వైపు నొప్పి పాకుతుంది. తిమ్మిర్లు, నొప్పులు ఒక చోట నుంచి ఇంకో చోటికి మారుతుంటాయి. మెడ నొప్పి, చేతుల నొప్పులు, నడుము నొప్పి, కుడి భుజం, మోకాళ్లు, పాదాల నొప్పి, నీరసం, గుచ్చినట్టుండే నొప్పులు, కీళ్లనొప్పి, వాపు ఉంటాయి. చల్లగాలికి, కదలికలకు ఎక్కువ అవుతాయి.
ఆర్నికా : గాయాలు తగిలిన తరువాత వచ్చే సమస్యలకు మంచి మందు. శరీరం సున్నితంగా ఉండి, స్పర్శని తట్టుకోలేరు. పడుకున్న ప్రదేశం గట్టిగా అనిపించి కదులుతుంటారు. చిన్న పనులకే తొందరగా అలసిపోతారు. ఒంటరిగా ఉండాలనుకుంటారు. నడుమునొప్పి, తొందరగా బెణకడం లేదా వాటి స్థానం నుంచి కదలినట్టు అనిపించడం. శరీరం కింది భాగం నుంచి నొప్పి పై భాగానికి వెళ్తుంది. ఆందోళగా ఉంటారు. స్పర్శ, కదలికలు,చల్లని వాతావరణానికి ఎక్కువ అవుతాయి. పడుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఆర్సినికమ్ ఆల్బమ్ : వీరు అధిక ఆందోళన కలిగి, విశ్రాంతి లేకుండా ఉంటారు. ఒంటరితనమంటే భయం. స్వార్థం, పొదుపు, శరీరం వణకడం, మెలితిరిగినట్టు అనిపించడం, నీరసం, బరవు, పాదాల వాపు, నొప్పులు మండినట్లు ఉండడం, అధిక దాహం ఉంటాయి. చల్లని వాతావరణానికి, అర్ధరాత్రి నొప్పులు ఎక్కువ. వేడి వాతావరణంలో ఉపశమనం లభిస్తుంది.
murali

2735
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles