కర్టెన్ల ఎంపికకు.. కొలతలే కీలకం!


Sat,January 26, 2019 12:38 AM

window-curtains
కిటికీలకు అమర్చే కర్టెన్ల వల్ల కాలుష్యం నుంచి రక్షించుకోవటంతో పాటు ఇంటి అందాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే కర్టెన్లు ఎలా ఉండాలి.. ఎలాంటి రంగులు ఎంపిక చేసుకోవాలనేది.. వారి అభిరుచులను బట్టి ఉంటుంది. కర్టెన్ల కొనుగోలులో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అనుకున్నట్లుగానే ఇంటి అందం మరింత ద్విగుణీకృతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా కర్టెన్ల కొలతల్ని పక్కాగా చూసుకోవాలి. కిటికీ పొడవు, వెడల్పుల కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పలు రకాల వస్త్రాలతో తయారు చేసిన కర్టెన్లు మార్కెట్‌లో ఉన్నాయి. సిల్క్, కాటన్ కర్టెన్లకు మంచి డిమాండ్ ఉంది. గదుల రకాలను బట్టి వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముదురు రంగు కర్టెన్ల కంటే లేత రంగు కర్టెన్లు అన్ని గదులకు సరిపోతుంది. సహజమైన గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేందుకు వీలుంటుంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని కోరుకునే వారికి ముదురు రంగు కర్టెన్ల్లే సరైన ఎంపిక. కర్టెన్ల వెనుక వైపు కాంతిని తగ్గించుకునే, పెంచుకునే ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

332
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles