కప్పు కాఫీ రూ.6 వేలు!


Sat,February 9, 2019 11:05 PM

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే వార్తల్లో నిలిచింది. ఎందుకంటే హీరో రామ్.. డైరెక్టర్ పూరికి ఓ విలువైన బహుమతిని ఇచ్చాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్.
Costly-Coffie
ఇంతకీ రామ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఓ కాఫీ పొడి ప్యాకెట్. ఇందులో ఏముంది గొప్ప? అనుకునేరు. ఈ కాఫీ పొడి నిజంగానే గొప్ప. ఎందుకంటే ఒక కప్పు కాఫీ అక్షరాల ఆరువేల రూపాయలు. ఇది నిజం. మేరా ఇస్మార్ట్ శంకర్.. రామ్, నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కోపి లువాక్ కాఫీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం నేను ఆ కాఫీ తాగుతున్నాను. ఈ కాఫీ గురించి గూగుల్ చేయండి. మీకు దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి అంటూ ట్వీట్ చేశాడు పూరి జగన్నాథ్. ఈ ట్వీట్‌పై స్పందించిన రామ్ గూగుల్ చేయకండ్రి.. మ్యాటర్ తెలిస్తే ధిమాక్ ఖరాబ్ ఐతది అంటూ రిప్లయ్ ఇచ్చాడు. అయినా మన నెటిజన్లు వెతకకుండా ఉంటారా? ఆ ఖరీదైన కాఫీ పొడి ఏంటో తెలుసుకున్నారు కూడా.


కొన్ని తినుబండారాలు, పానీయాలు వాటి రుచిని బట్టి భారీ ధర పలుకుతుంటాయి. అలాంటి పానీయాల్లో ఒకటి కోపి లువాక్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీగా పేరుగాంచింది. దీని తయారీ విధానమే షాక్‌కు గురిచేసే అంశం. ఆసియా ఖండంలో నివసించే పునుగుపిల్లి జాతికి చెందిన చివెట్స్ అనే జంతువులు అత్యంత ఆరోగ్యకరమైన కాఫీ చెర్రీస్‌ను ఎంచుకొని తింటాయి. చివెట్స్, చెర్రీస్ తిన్నప్పుడు వాటిపై ఉండే గుజ్జు మాత్రమే జీర్ణం అవుతుంది. లోపల ఉండే గింజలు పెంట రూపంలో బయటికి వస్తాయి. దానిని అనేక సార్లు శుభ్రం చేసి విక్రయిస్తారు. ఇవి జీర్ణమవుతున్న సమయంలో విడుదలైన రసాయనాలు ఆ గింజల మీద ప్రభావం చూపుతాయి. దీంతో ఆ గింజలతో చేసిన కాఫీ రుచికరంగా ఉంటుంది. అందుకే ఇంత రేటు.. అంత పబ్లిసిటీ.

642
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles