కడుపులో మంట...? నిర్లక్ష్యం వద్దు!


Wed,July 12, 2017 01:22 AM

భోజనం తర్వాత అసౌకర్యంగా ఉండడం, కడుపులో ఛాతిలో, గొంతులో మంటగా ఉండడం తర్వాత గుండెలో మంట, ఆసిడ్ రిఫ్ల్లెక్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సందర్భాల్లో ఛాతిలో మంటగా ఉండడం ఒక్కోసారి ఆహార వాహికలో, స్వరపేటిక లేదా హైపోఫార్నియల్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. మనదేశంలో కేవలం నగర ప్రాంతాల్లోనే 30-45 సంవత్సరా మధ్య వయస్కుల్లో 16-18 శాతం మంది గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ సమస్యతో బాధపడుతున్నారు.
food

రిఫ్లక్స్‌కు కారణాలు

సరైన ఆహార అలవాట్లు లేకపోవడం. కొవ్వులు కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం. తీసుకునే ఆహారంలో తగినంత పీచు పదార్థం లేకపోవడం. వంటి కారణాలతో పెప్టిక్ అల్సర్లు, గ్లాల్ బ్లాడర్ సమస్యలు లేదా హయాటస్ హెర్నియా వంటి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఆహారం తీసుకున్నా ఆసిడ్ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది.
చిన్న వయసులో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యడం అంత మంచిది కాదు. వీలైనంత త్వరగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఏవో ఒక మందులతో కాలం వెల్లబుచ్చడం మంచిది కాదు తర్వాత కాలంలో ఇది చాలా పెద్ద సమస్యగా పరిణమించవచ్చు.

ఛాతిలో మంటకు కారణాలు

ఎక్కువ కొవ్వు కలిగిన పదార్ధాలు, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, ఆల్కాహాల్ వంటి దురలవాట్లు, నొప్పి నివారణ మందులు, యాంటి బయాటిక్స్ ఎక్కువగా వాడడం. వేళకు భోజనంచెయ్యకపోవడం. పుల్లని పండ్లు, కార్బొనేటెడ్, కేఫినేటెడ్ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం

ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి

అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల దాన్ని జీర్ణం చెయ్యడానికి శరీరానికి మరింత ఎక్కువ ఆసిడ్ ఉత్పత్తి చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల అసిడిటి సమస్య వస్తుంది. దీన్ని సరిచెయ్యాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. మసాలాలు కలిగిన నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. తక్కువగా ఎక్కువ సార్లు తినడం అలవాటు చేసుకోవాలి. తిన్న తర్వాత ఒక గంట వరకు పడుకోకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా లేదా ధ్యానం అలవరుచుకుంటే మంచిది. బరువు మోతాదుకు మించి పెరుగకుండా జాగ్రత్త పడాలి.పదేపదే జీర్ణాశయం నుంచి ఆసిడ్ ఆహార వాహికలోకి వెనక్కి రావడం వల్ల కొంత కాలానికి ఆహారవాహిక కింది భాగం జీర్ణాశయం మాదిరిగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. పొగతాగడం, ఆల్కాహాల్ అలవాటు లేని వారిలో రిఫ్లెక్స్ డిసీజ్ క్యాన్సర్‌కు అతి ముఖ్య కారణం.

40 శాతం మంది గొంతు క్యాన్సర్ బాధితుల్లో ఆసిడ్ రిఫ్లెక్స్‌కు సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించవు. అందుకు కారణం వారిలోని ఆహారనాళం కింది భాగం లోపలి పొర జీర్ణాశయం లోపలి పొరల మాదిరిగా మారిపోవడమే. అందువల్ల వారిలో రిఫ్ల్లెక్స్ వల్ల కలిగే ఇబ్బంది ఉండదు. ఒకసారి లోపల క్యాన్సర్ పెరుగడం మొదలైతే 75 శాతం మందిలో ఛాతి మంట లక్షణాలు కనిపించవు.
dranad

ఎవరికి ప్రమాదం

నిద్ర సరిగా ఉండని వారు, చాలా వేగంగా భోజనం ముగించే వారు, సమయానికి భోంచెయ్యని వారు, పొగతాగడం, ఆల్కాహాల్ వంటి దురలవాట్లు ఉన్న వారికి ప్రమాదం పొంచి ఉన్నట్లే. కడుపులో, ఛాతిలో వచ్చే మంటను నిర్లక్ష్యం చెయ్యడం ఎంత మాత్రమూ మంచిది కాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే దీన్ని ఆదిలోనే అంతం చెయ్యవచ్చు. లేదంటే ఇది తర్వాత కాలంలో ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

707
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles