కటింగ్‌కు రూ.28 వేలు!


Sun,February 17, 2019 01:38 AM

మీరు చదివింది నిజమే. ఇది నిజాయితీకి దక్కిన బహుమానం. ఒక్క కటింగ్‌కు అక్షరాల 28 వేల రూపాయలు వచ్చాయి. పది రూపాయల కోసం ప్రాణం తీసే ఈ రోజుల్లో కూడా.. ఇంకా నిజాయితీ బతికే ఉందని చెప్పిన వ్యక్తికి లభించిన బహుమానం.
Cutting
ఈ రోజుల్లో నిజాయితీపరులు ఉండటం చాలా కష్టం. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న రోజులివి. కాసుల కోసం సొంతవారి ప్రాణాలు తీసే మనుషులు ఉన్నారు. ఇక విదేశీయులను మోసం చేసేవారికి కొదవే లేదు. అలాంటి ఈ రోజుల్లోనూ ఆ వ్యక్తి నిజాయితీగా వ్యవహరించాడు. పేదరికంలో ఉన్నా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా నీతిని మాత్రం కోల్పోలేదు. అదే అతడికి వరంగా మారింది. 28వేల రూపాయలు సంపాదించేలా చేసింది. అహ్మదాబాద్‌లో రోడ్డు పక్కనే కటింగ్ చేస్తున్న వ్యక్తిని నార్వేకి చెందిన ప్రముఖ యూట్యూబర్ హెరాల్డ్ బాల్డర్ కలిశాడు. ఇతను దేశ దేశాలు తిరుగుతు ట్రావెల్ వ్లాగ్స్‌లో ఆ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించిన హెరాల్డ్.. కటింగ్ చేస్తున్న వ్యక్తి సాధక బాధకాలు తెలుసుకున్నాడు.


తర్వాత తానూ కటింగ్ చేయించుకున్నాడు. అయితే, తాను విదేశీయుడు అవడంతో అతను మోసం చేస్తాడేమో.. డబ్బులు ఎక్కువ అడుగుతాడేమోనని అనుకున్నాడు హెరాల్డ్. అయితే ఆ వ్యక్తి కేవలం 20 రూపాయలే తీసుకోవడంతో అవాక్కయ్యాడు హెరాల్డ్. వెంటనే తన నిజాయితీకి మెచ్చి.. 400 డాలర్లు (రూ.28వేలు) ఇచ్చాడు. ఆ డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కోమని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు. తన జర్నీలో ఎందరినో కలిశానని, కానీ.. ఇలాంటి నిజాయితీపరుడిని చూడలేదని, అందుకే ఆ మంచి వ్యక్తికి అదనంగా బహుమతి ఇచ్చానని హెరాల్డ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అదిప్పుడు వైరల్‌గా మారింది.

890
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles