కండ్లకాంతికి కాటుక


Tue,February 26, 2019 01:17 AM

చాలామంది కాటుక పెట్టుకుంటే కండ్లకు అందం వస్తుందనుకుంటారు. అందంతో పాటు అదనపు లాభాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కాటుక కంటికి మేలు కూడా చేస్తుంది. కాటుక వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
eyes
-ఆయుర్వేదం ప్రకారం కాటుక పెట్టుకోవడం వల్ల కండ్లకు చల్లదనం లభిస్తుంది. అలాగే దుమ్ము, ధూళి కణాలు కండ్లలో పడకుండా కాటుక అడ్డుకుంటుంది.
-కండ్లు ఎప్పుడూ తాజాగా, మెరుస్తుండేట్లు చేస్తుంది కాటుక. కండ్లల్లో ఏర్పడే ఎర్రటి మచ్చలు కాటుక పెట్టుకోవడం వల్ల తగ్గిపోతాయి.
-కాటుక తయారీలో ప్రమిద, ఆముదం, దూది, రాగి పాత్ర, గంధం, కర్పూరం ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా శరీరానికి మేలు చేసే పదార్థాలే.
-కాటుక ధరించడానికి ముఖ్యమైన కారణం అందం. కాటుక పెట్టుకోవడం వల్ల కండ్లు పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
-జిడ్డు చర్మం ఉన్నవారు ఐస్‌ముక్కలతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది. తద్వారా కాటుక చెరిగిపోకుండా ఉంటుంది.
-కాటుక పెట్ట్టుకునే ముందు కంటి చుట్టూ పౌడర్ వేసుకుంటే చెమటను పౌడర్ పీల్చుకుంటుంది.


ఆరోగ్య చిట్కాలు

-వారంలో రెండుసార్లు బీన్స్ కూర తింటే ఎముకలు ఉక్కులా మారతాయి.
-రోజుకి ఐదు లీటర్లు నీరు తాగితే రోగాలు దరిచేరవు.
-ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని కొవ్వుని తొలిగించవచ్చు.

337
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles