కంచి పరికిణీ.. కనికట్టు చేసేనె!


Fri,March 1, 2019 01:49 AM

ఓణీ.. పరికిణీ.. కన్నెపిల్లలకే కాదు.. పెళ్లయిన పడుతులకు.. ఈ మధ్యకాలంలో హాట్ ఫేవరెట్‌గా మారిపోయాయి.. పండుగకు.. ప్రత్యేక వేడుకలకు.. ఓణీయే ఓంకారంగా.. పరికిణీయే పరమార్థంగా జీవిస్తున్నారు.. ఓల్డ్ ట్రెండ్‌లకి కొత్త సొబగులద్ది.. పదనిసలు పలికించే ఓణీలను.. కనికట్టు చేసే.. కంచి పరికిణీలను ఈ వారం ఫ్యాషన్‌గా ఇస్తున్నాం..
Fashan
1. ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆకుపచ్చని కంచి పట్టు లంగాకి గోల్డెన్ సెల్ఫ్ వీవింగ్ బుటీస్ వచ్చాయి. దీనికి కంచిపట్టు పెద్ద జరీ బార్డర్‌ని అటాచ్ చేయడంతో సూపర్‌గా కనిపిస్తున్నది. పింక్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్ వర్క్ యాడ్ చేయడంతో పాటు చివర కంచి పట్టు బార్డర్‌ని అటాచ్ చేశాం. ఆకుపచ్చని నెట్ దుపట్టా మీద గోల్డెన్ సీక్వెన్స్ బార్డర్‌తో పాటు, పింక్ రాసిల్క్‌ని కుట్టాం. అక్కడక్కడ గోల్డెన్ సీక్వెన్స్ బుటీలు ఇవ్వడంతో మెరిసిపోతున్నది.

2. యెల్లో కలర్ కంచి పట్టు లంగా ఇది. దీని మీద సెల్ఫ్ వీవింగ్ గోల్డెన్ బుటీస్‌తో పాటు, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. దీనికి హంసల డిజైన్ వచ్చిన వంకాయ రంగు బార్డర్‌ని జత చేయడంతో లుక్కే మారిపోయింది. దీనికి వంకాయ రంగు రాసిల్క్ బ్లౌజ్ ఎంచుకున్నాం. దీని మీద హెవీగా జర్దోసీ, కుందన్స్‌తో వర్క్ చేశాం. మోచేతుల వరకు బ్లౌజ్ స్లీవ్స్ పెట్టాం. వంకాయ రంగు నెట్ దుపట్టా మీద కూడా బ్లౌజ్ మీదలాగే హెవీ వర్క్ చేయించాం.
Fashan1
3. నల్లని కంచి పట్టు లంగా మీద సిల్వర్ డాట్స్ వీవింగ్ వచ్చాయి. దీనికి గోల్డ్, సిల్వర్ మిక్సింగ్‌లో వచ్చిన బార్డర్‌ని ఎంచుకున్నాం. అయితే దీన్ని డబుల్ బార్డర్‌గా వేసేసరికి లుక్ అదిరిపోయింది. బ్లాక్ రాసిల్క్ బ్లౌజ్ నెక్‌కి మాత్రమే జర్దోసీ, సిల్వర్ థ్రెడ్‌తో వర్క్ చేయించాం. జరీ బార్డర్ స్లీవ్స్‌గా ఎంచుకున్నాం. పింక్ లకర్ నెట్ దుపట్టాకి సీక్వెన్స్ బార్డర్, బుటీస్ ఇచ్చాం.

4. గోల్డెన్ చెక్స్ వచ్చిన ఎర్రని కంచి పట్టు లంగా ఇది. దీనికి బ్లూ కలర్ ఏనుగుల డిజైన్ వచ్చిన గోల్డెన్ జరీ బార్డర్‌ని జతచేశాం. దీన్ని డబుల్ బార్డర్‌గా వేయడంతో మరింత బాగా మెరిసిపోతున్నది. బ్లూ కలర్ రాసిల్క్ బ్లౌజ్‌కి జర్దోసీ, థ్రెడ్, కుందన్స్‌తో నెక్ లైన్ స్లీవ్స్ చివర డిజైన్ చేశాం. ఎర్రని కంచి పట్టుని మోచేతుల వరకు ఇచ్చాం. క్రీమ్ కలర్ నెట్ దుపట్టాకి అక్కడక్కడ బుటీస్, గోల్డెన్ సీక్వెన్స్ బార్డర్, బ్లూ రాసిల్క్‌తో పాటు ముత్యాల బార్డర్ వేయడంతో బాగా కనిపిస్తున్నది.

5. పీచ్ కలర్ కంచి పట్టు లంగాకి పువ్వులు, లతల డిజైన్ వచ్చింది. దీనికి ఎర్రని గోల్డెన్ డబుల్ జరీ బార్డర్‌ని జతచేశాం. ఎర్రని రాసిల్క్ బ్లౌజ్ మీద జర్దోసీ, గోల్డెన్ జరీతో, స్టోన్స్‌తో హెవీగా వర్క్ చేయించాం. ఎర్రని నెట్ దుపట్టాకి గోల్డెన్ బార్డర్, గోల్డెన్ బుటీస్ మరింత మెరిసిపోయేలా చేస్తుంది.

-మోడల్
-శ్రావణ భార్గవి
పవులూరి నాగతేజ
ఫ్యాషన్ డిజైనర్, తేజ శారీస్
కూకట్‌పల్లి, హైదరాబాద్
tejasarees@yahoo.com

638
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles