ఓ ఆశా వర్కర్ ఆదర్శం..


Fri,February 8, 2019 01:40 AM

గ్రామాల్లో ఆశా వర్కర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. మాతా, శిశు సంరక్షణకు వీళ్లు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. అలాంటి ఆశా వర్కరే ఉమా పాటిల్. మహారాష్ట్రకు చెందిన ఈ ఉమ ఆశా వర్కర్‌గా విధులు నిర్వహిస్తూ గ్రామాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది.
asha-worker
ఆశా వర్కర్ అంటే ఉదయాన్నే డ్యూటీకి వెళ్లడం, గ్రామాల్లో సర్వే చేయడం, రికార్డులు నమోదు చేసి పై అధికారులకు అందించడం ఇంతే అనుకుంటాం. కానీ ఆ పని చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శ్రమ. మహారాష్ట్రలోని ఆరాగ్ గ్రామంలో ఆశా వర్కర్‌గా పని చేస్తున్న ఉమాపాటిల్ కూడా అంతే రికార్డులు రాసి, సర్వేలు చేసి, అధికారులకు అప్పగించడమే కాదు.. ఆమె చూసిన సమస్యలను పరిష్కరించడానికి, మాతా శిశు సంరక్షణకు, మరణాల రేట్లను తగ్గించడానికి కృషి చేస్తున్నది. ఆమె చేసిన కృషికి ప్రభుత్వాస్పత్రిలో ప్రసూతిలు పెరిగాయి. విధి నిర్వహణలో ఆమె పెట్టే ఖర్చు, ఆమె నెల వేతనానికి సగం. రికార్డులు రాయడానికి స్టేషనరీ, గ్రామాల్లో పర్యటించడానికి ఖర్చులు అవ్వన్నీ ఆమే భరిస్తున్నది. ఆమె విధులు నిర్వహిస్తున్న గ్రామంలో సుమారు 15,600 జనాభా ఉంది. ఈ గ్రామ పరిధిలో 15 మంది, అరాగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో 41 మంది ఆశాలు పని చేస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన పై దృష్టి సారించింది. దీని వల్ల మరణాల రేటు తగ్గినట్టు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ గుర్తించింది. 2005-06లో ప్రభుత్వ ఆసు పత్రిలో ప్రసూతిలు 64.6శాతం ఉంటే నేడు అవి 90.3శాతానికి పెరిగాయి. దీనికి కారణం ఉమాపాటిల్ తీసుకున్న ప్రత్యేక చొరవ అని అధికారులు ప్రశంసిస్తున్నారు. అయితే ఆమెకు వచ్చేది తక్కువ వేతనమే అయినా తన బాధ్యతను నిలుపుకుంటున్నది.

971
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles