ఓవెన్ వాడండిలా..


Sat,February 16, 2019 01:29 AM

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఓవెన్ ఉంటుంది. అయితే కొందరింట్లో పేరుకే గాని దీన్ని ఎలా వాడాలో పూర్తి అవగాహన ఉండదు. ఓవెన్‌ను ఎలా ఉపయోగించాలో కొన్ని చిట్కాలు మీ కోసం.
oven
-స్విచ్ ఆన్ చేసిన ఐదు నిమిషాల తర్వాత ఓవెన్ వాడాలి. అదే విధంగా స్విచ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాల తర్వాతే ఓవెన్‌లో చేయి పెట్టడం మంచిది.
-ఈ క్రమంలో ఓవెన్‌లో పెట్టిన పదార్థాలు ఉడుకుతున్నాయో లేదో మాటిమాటికి తెరచి చూడకూడదు. ఓవెన్ పైభాగంలో ఉండే ట్రాన్స్‌పరెంట్ పొర ద్వారా చూడాలి.
-ఓవెన్‌ని నీటితో కడిగితే త్వరగా పాడవుతుంది. పొడి బట్టతో తుడుస్తుండాలి. ఒకసారి వాడిన ఓవెన్ పది నిమిషాల పాటు విరామం ఇవ్వాలి. తర్వాత తిరిగి వాడొచ్చు.
-ఓవెన్ ఎక్కువ విద్యుత్‌ని వినియోగించుకుంటుంది. కాబట్టి త్రీఫేస్ ప్లగ్‌ను వాడడం మంచిది. ఓవెన్ వేడిగా ఉంటే బలవంతంగా తెరవకూడదు. చల్లారిన తర్వాత దానికదే తెరుచుకుంటుంది.
-మామూలు ఓవెన్‌ల కన్నా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న ఎలక్ట్రిక్ ఓవెన్ ఉత్తమమైంది. ఓవెన్ ద్వారా బ్రెడ్, కేకులు, బిస్కెట్లు, నాన్‌రోటీ ఇతర వంటకాలను తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.

277
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles