ఒత్తిడిని జయించండిలా!


Sun,March 10, 2019 12:25 AM

Depression
-ఒత్తిడిని జయించాలంటే ముందుగా కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి. చిన్న పనులతో ఎప్పడూ బిజీగా ఉండాలి. అపుడే మానసికంగా సేదతీరవచ్చు. అందుకే పెద్ద హోదాలో ఉన్నవారు కూడా తమ అలవాట్లు, పనులను వదులుకోరు.
-ఒత్తిడిగా ఉన్నప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కావాలంటే కొంత సేపు సమయం తీసుకొని నిదానంగా ఆలోచించి వ్యవహరించాలి. లేదంటే దిద్దుకోలేనంత తప్పు పైన పడుతుంది.
-రోజూవారి పనుల్లో ఆందోళనలు పెట్టుకోకూడదు. ఒకటే ఆలోచన వెంటపడి తరుముతుంటే దాని నుంచి డైవర్షన్ తీసుకోవాలి. పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. పదే పదే దాన్ని తలుచుకోవడం మంచిది కాదు.
-కొన్ని విషయాలే మనచేతిలో ఉంటాయి. మరికొన్ని మన చేతుల్లో ఉండవనే జీవన సత్యాన్ని గ్రహించాలి. శారీరక వ్యాయామం కూడా చాలా అవసరం.
-ఎప్పుడూ ఒకే చోట కూర్చొని పనిచేయకూడదు. అప్పుడప్పుడు స్థలం మారుస్తూ ఉండాలి. అప్పుడే కొత్త ఆలోచనలు, పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల మెదడు మొద్దు బారిపోతుంది. తేలికపాటి వ్యాయామాలతో రక్తప్రసరణ వేగవంతమవుతుంది.

246
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles