ఒక సైనికుడిలా ఆలోచించండి!


Thu,March 7, 2019 12:09 AM

కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని యుద్ధం కావాలని ఉపన్యాసాలివ్వడం కాదు. ఒక సైనికుడు కుటుంబీకుల నుంచి ఎంతో ప్రేరణ పొంది వెళ్తాడు. వాళ్లను గౌరవించాలి. సామాన్యుల ప్రాణాలకూ మనం విలువనివ్వాలి. యుద్ధం వస్తే ఇది సాధ్యం కాదు అని అంటున్నది కార్గిల్ యుద్ధంలో అమరుడైన ఓ సైనికాధికారి కూతురు.
war
1999 కార్గిల్ యుద్ధ సమయం. దివ్యా దివేదికి అప్పుడు ఎనిమిదేండ్లు. తండ్రి సీబీ దివేది సైనికాధికారి. యుద్ధంకంటే కొన్ని రోజుల మందు సెలవుపై ఇంటికి వచ్చాడు. అప్పుడే సైన్యం నుంచి సందేశం అందింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొనాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అవి. విధి నిర్వహణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లిన తండ్రి మళ్లీ ఇంటికి రాలేదు. అయితే ఇటీవల జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారంపై ఆమె తీవ్రంగా స్పందించింది. యుద్ధమే యుద్ధానికి పరిష్కారం కాదు దాని పర్యవసానాలు సామాన్యుల మీద ప్రభావం చూపుతాయి అని ఆవేదన వ్యక్తం చేసింది. నాన్న యుద్ధానికి వెళ్లే మందు మా ఇంట్లో అందరం ఆయన చుట్టూ చేరి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్లం. అలా వెళ్లిన మా నాన్న కార్గిల్ యుద్ధం తర్వాత తిరిగి రాలేదు. పగ, ప్రతీకారం, యుద్ధం గురించి మాట్లాడేవారికి దాని మూలంగా కలిగే బాధ నేరుగా తెలిసి ఉండదు. అందుకే కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని యుద్ధం కావాలంటూ ఎంగేజింగ్ పోస్టులు పెడుతున్నారు అంటూ ఆవేదన చెందింది. యుద్ధం, శాంతి ఎప్పుడూ అవి చర్చనీయాంశాలే. ఒక్కోసారి ఈ రెండు విషయాలే దేశంలో కొందరు ప్రజలను విభజిస్తాయి కూడా. ఒక సైనికుడిలాగా ఆలోచించండి. ప్రాణాలు పణంగా పెట్టి మన రక్షణ బాధ్యతలు తీసుకుంటున్నారు. మనం వాళ్లకూ, వాళ్ల కుటుంబాలకు రుణపడి ఉండాలి అంటున్నది దీక్ష.

466
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles