ఒక్క బటన్‌తో రక్షణ!


Fri,March 1, 2019 03:23 AM

ఆపద సమయాల్లో మనం కష్టాల్లో ఉన్నామని మన వారికి చెప్పడం కష్టమే. అందరికీ సమాచారం ఇచ్చేంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒకే బటన్ నొక్కితే మనం ఆపదలో ఉన్నామని ఒకేసారి మనవారికి, పోలీసువారికి, వైద్యసేవకు తెలిస్తే.. అలా తెలిపే సేవను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.
safety-button
ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల మీద జరిగిన ఆకృత్యాలు ఒక్కొటొక్కటిగా బయటపడ్డాయి. వారి భద్రత గురించి తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి. నిర్భయ చట్టం, మరెన్నో మహిళా భద్రత సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎన్నో యాప్‌లు, టెక్నాలజీని ఊతంగా చేసుకొని మహిళలకు తక్షణ సహాయం కోసం ఏర్పాట్ల గురించి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కోవలో వచ్చిందే పానిక్ బటన్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్‌ఎస్‌ఎస్). మొబైల్‌ఫోన్‌లో ప్రత్యేకంగా అమర్చుకునే పానిక్ బటన్ ద్వారా క్షణాల్లో మన దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చేరుతుంది. మొబైల్‌లో ముందే సెట్ చేసి పెట్టుకున్న పానిక్ అనే బటన్‌లో 112 అనే ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఈ పానిక్ బటన్ నొక్కగానే మనకు కావాల్సిన వాళ్లకు, పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం వెళ్లిపోతుంది. జీపీఎస్ ఆధారంగా మనం ఉన్న ప్రదేశాన్ని గుర్తించి క్షణాల్లో సహాయం అందుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, ఆప్తులు, పోలీసులు, వైద్యం, ఫైర్ ఇలా ముందే సెట్ చేసి పెట్టుకున్న వారికి మనం ఆపదలో ఉన్నట్టు సమాచారం, లొకేషన్ వెళ్లిపోతుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పానిక్ బటన్ మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఈ ప్రాజెక్టును తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

628
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles