ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి ఎన్‌ఎఫ్‌వో ఫండ్


Sat,December 22, 2018 01:14 AM

ICICI_Prude
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ మరో ఫండ్‌ను జారీ చేసింది. ఇండియా ఆపర్చునీటిస్ పేరుతో ప్రకటించిన ఈ ఫండ్ ఈ నెల 26న ప్రారంభమై వచ్చే నెల 9న ముగియనున్నది. కనీసంగా రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చును. గరిష్ఠంగా ఎంతైన పెట్టుకోవచ్చును. ఇలా సేకరించిన నిధులను నిఫ్టీ-500 సంస్థల్లో పెట్టుబడి పెట్టనున్నది. ముఖ్యంగా మౌలిక, ఫార్మా రంగానికి చెందిన బ్లూచిప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ భట్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఎన్‌ఎఫ్‌వో ద్వారా కనీసంగా రూ.1,200 కోట్లు, గరిష్ఠంగా రూ.2 వేల కోట్ల వరకు నిధులను సేకరించాలనుకుంటున్నది. దీర్ఘకాలికంగా లాభాలు ఆర్జించేవారు ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles