ఐసీఐసీఐ ఈక్విటీ ఫండ్‌కు అనూహ్య స్పందన


Sat,January 5, 2019 01:08 AM

Equity-Fund-Investment
దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు పన్ను ఆదా చేసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), ట్యాక్స్-సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేషన్(ఎన్‌ఎస్‌సీ), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీం(ఈఎల్‌ఎస్‌ఎస్)లను క్లెయిం చేసుకోవడం ద్వారా దేశీయ ఆదాయ పన్ను 80సీ చట్టం ప్రకారం పన్ను రాయితీ పొందవచ్చును. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్లపై కూడా పన్ను రాయితీ లభిస్తున్నది. ఈఎల్‌ఎస్‌ఎస్ ద్వారా సేకరించిన నిధులను రెండు దశాబ్దాలుగా మంచి రికార్డు కలిగివున్న ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈఎల్‌ఎస్‌ఎస్ కింద వార్షికంగా రూ.12 లక్షల ఆదాయం కలిగివున్నవారు పన్ను రాయితీ కింద రూ.1.50 లక్షల వరకు పొందే అవకాశం ఉన్నది. దీంతో ప్రస్తుతం ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగంలో అత్యధిక ఫండ్లు లభిస్తున్నాయి. దీంట్లోభాగంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ జారీచేసిన దీర్ఘకాల ఈక్విటీ ఫండ్(ట్యాక్స్ సేవింగ్)కు అనూహ్య స్పందన లభించింది. ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగంలో లభిస్తున్న ఫండ్లలో ఇదే ఉత్తమమైనదని కంపెనీ పేర్కొంది. పదేండ్ల కాలపరిమితి కలిగిన ఈ ఫండ్‌పై 19.53 శాతం రిటర్నులు పంచుతున్నది.

ఇదే సమయంలో నిఫ్టీ 50 ఇండెక్స్ 14.31 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ ఫండ్ జారీచేసినప్పటికీ నుంచి 20.36 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. నెలకు రూ.10 వేల చొప్పున సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టిన వారికి మూడేండ్లలో రూ.4.7 లక్షలు, ఏడేండ్లలో రూ.14.3 లక్షలు, పదేండ్లలో రూ.27.3 లక్షలు, పదిహేనేండ్లలో రూ.67.3 లక్షల మేర లభించే అవకాశం ఉన్నది. ఈ ఫండ్ ద్వారా సేకరించినవాటిని ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, ఆటో, ఇంధనం, బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles