ఐఫాలో అద్భుత ఆవిష్కరణలు


Wed,September 5, 2018 03:55 AM

యూరప్‌లో జరిగే అతిపెద్ద ఎలక్ట్రానిక్ ట్రేడ్ షో ఐఎఫ్‌ఏ. ఈ ఏడాది బెర్లిన్‌లో జరుగుతున్న ఈ ట్రేడ్ షో అద్భుతాలను ఆవిష్కరించింది. ఆగస్టు 31న ప్రారంభమైన ఐఎఫ్‌ఏ సెప్టెంబర్ 5న ముగుస్తుంది. ప్రతీ ఏడాది ఐఎఫ్‌ఏ నిర్వహించే ట్రేడ్ షోలో సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన వస్తువులు, గాడ్జెట్లు విడుదల చేస్తారు. అలాగే ఈ ఏడాది కూడా బెర్లిన్‌లో జరిగిన ట్రేడ్ షోలో కొన్ని గాడ్జెట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అవి మీ కోసం..
IFA

వైఫై బూస్టర్ ప్లస్ స్మార్ట్ స్పీకర్

వైఫై సిగ్నల్ బాగా రావాలంటే వైఫై బూస్టర్ పెట్టుకుంటాం. ఇక స్మార్ట్ స్పీకర్ల వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ స్పీకర్లు అందరూ వాడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండింటినీ ఒకే గాడ్జెట్ రూపంలో చూడాలనుకునేవారి కోసం ఐఎఫ్‌ఏ 2018 ఓ గాడ్జెట్ తీసుకొచ్చింది. ఆర్బి నెట్‌గేర్ వాయిస్ పేరుతో స్మార్ట్ స్పీకర్‌ను పోలి ఉండే ఓ స్పీకర్ ఐఎఫ్‌ఏలో ఆవిష్కృతమైంది. ఇది 3.5 అంగుళాల ఫ్రంట్ ఫేసింగ్ ఊఫర్‌తో అద్భుతమైన సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇదే స్పీకర్‌లో 4500 చదరపు అడుగుల వరకు వైఫై సిగ్నల్స్‌ను అందించే బూస్టర్ కూడా ఇమిడి ఉంది. ఈ రెండింటినీ కలిపి ఒకే గాడ్జెట్‌గా ఆర్బి వాయిస్ పేరుతో ఈ ట్రేడ్ షోలో ఆవిష్కృతమయింది.
wifi-boosterf

గేమింగ్ త్రోనోస్

గేమింగ్ ప్రేమికులకు ఈ ట్రేడ్ షో మంచి బహుమతినిచ్చింది. ఐదు ఫీట్ల పొడవు, 485 పౌండ్ల బరువుతో 27 అంగుళాల కర్వ్‌డ్ మానిటర్లు మూడువైపులా ఉండే ఏసర్ ప్రిడేటర్ త్రోనోస్ ఆవిష్కృతమైంది. కనుచూపుమేర మొత్తాన్ని ఈ మానిటర్ కవర్ చేస్తుంది.140 డిగ్రీల కోణంలో గేమింగ్ ఎంజాయ్ చేయవచ్చు. ఏసర్ కంపెనీ పరిచయం చేస్తున్న ఈ గేమింగ్ మానిటర్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నది.
thronos

చార్జర్లు

ఈ రోజుల్లో ఆక్సిజన్ లేకపోయినా తట్టుకుంటారేమో గానీ, మొబైల్‌లో చార్జింగ్ లేకపోతే నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. అందుకే టెక్నాలజీ కూడా ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. మొబైల్‌కే హత్తుకుని ఉండేలా పోర్టబుల్ మొబైల్ చార్జర్లను అందుబాటులోకి తెస్తున్నది. 7.5 వాట్ల చార్జింగ్ పవర్‌తో ఐఫోన్‌కి, 10 వాట్ల చార్జింగ్ పవర్‌తో ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ పోర్టబుల్ చార్జర్లు రూపొందించారు. మోఫీ అనే పోర్టబుల్ బ్యాటరీ కంపెనీ వీటిని తయారుచేసి ఐఎఫ్‌ఏ ట్రేడ్ షోలో ప్రదర్శించింది.
charger

దృఢమైన మెమొరీకార్డులు

మెమొరీ కార్డుల్లో ఎన్నో జ్ఞాపకాలు ఫొటోల రూపంలో భద్రపరుచుకుంటాం. కొన్నిసార్లు అవి డ్యామేజ్ అయితే ఆ జ్ఞాపకాల తాలూకు ఆనవాళన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టే. అయితే.. ఐఎఫ్‌ఏ ట్రేడ్ షో 2018 జ్ఞాపకాలను ప్రేమించేవారికి ఒక మంచి బహుమతినిచ్చింది. 128 జీబీ స్టోరేజ్‌తో దృఢమైన మెమొరీకార్డులు పరిచయం చేసింది. ప్రస్తుతం ఉన్న మెమొరీకార్డుల కంటే ఇవి 18 రెట్లు దృఢంగా ఉంటాయి. ఈ మెమొరీకార్డులను సోనీ పలుసార్లు పరీక్షించి, నిర్ధారించుకున్న తర్వాతే ప్రదర్శనలో
memory-cards

ధరించగల రోబోలు

ఇందుగలదు.. అందులేదని సందేహం లేకుండా ఇప్పుడు అన్ని రంగాల్లోకి రోబోలు ప్రవేశించాయి. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఎస్‌జీ రోబోటిక్స్ కలిసి ఓ సరికొత్త అధ్యాయానికి తెర తీశాయి. మనుషులు ధరించగల రోబోలను ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా తయారుచేసి ఈ ట్రేడ్ షోలో ప్రదర్శించాయి. క్లోయి సూట్‌బోట్ అని ఈ రోబోలకు నామకరణం చేశారు. ఇవి నడుస్తున్నప్పుడు, ఏదైనా ఎత్తుకు ఎక్కుతున్నప్పుడు శరీర అవయవాలను సపోర్ట్ చేస్తాయి. అవయవాలకు అదనపు శక్తినిస్తాయి. వేసుకున్నామన్న ఫీలింగ్ లేకుండా తేలికగా ఉండేలా వీటిని రూపొందించారు.
wearable

422
Tags

More News

VIRAL NEWS