ఐటీ మినహాయింపు పొందడం ఎలా..


Fri,February 1, 2019 11:53 PM

income-tax
మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనున్న నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు పన్నుల రూపంలో తడిసి మోపెడు అవుతున్న సామాన్యుడినికి ఊరటనిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. దీంతోపాటు ఈ పన్ను నుంచి మినహాయింపు పొందడానికి ఎన్నో అవకాశాలున్నాయి. వీటిలో ఈక్విటీతో అనుసంధానం కలిగిన పొదుపు పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్‌ఫండ్(పీపీఎఫ్), ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)ల ద్వారా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చును.

ఆదాయ పన్ను చట్టం 80సీ ప్రకారం పన్ను చెల్లింపులు జరిపేవారు తమ పెట్టుబడులపై పన్ను రాయితీ పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ముందుగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించాలి. అలాగే ప్రస్తుతం పన్ను శ్లాబులు, పన్ను వసూళ్ల గురించి నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పన్ను ఎంతమేర చెల్లించేదానిపై చార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి సమాచారం సేకరించుకొని ఆ తర్వాత ఐటీ చెల్లింపులు జరుపాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి సంవత్సరానికి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారనుకో. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సంపాదించిన దానిపై లెక్కించి పన్ను విధించడం జరుగుతున్నది.

దీంట్లో కూడా ఇంటి ఖర్చు, పిల్లలు ఉంటే వారి విద్యకోసం పెట్టే ఖర్చు, వ్యవసాయం, బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు, ఇతర ఖర్చులను చూపించుకొని పన్ను మినహాయింపు పొందవచ్చును. వీటితోపాటు ట్యాక్స్ లయబిలిటీ కింద పన్ను ప్రయోజనాలు పొందాలంటే పన్ను పొదుపులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చును. పన్ను కింద వచ్చే ఆదాయం గురించి నిశితంగా పరిశీలిద్దాం..

మీకు ఏయే రూపంలో వచ్చే ఆదాయాన్ని ఒక్క జాబితాను రూపొందించుకోవాలి..వీటిలో వేతనం, బ్యాంక్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రెంటల్ ఆదాయం లాంటివి ఒకవేళ వేతన జీవులైతే..బేసిక్ జీతం, కరువు బత్తెం(డీఏ), కమీషన్, బోనస్, ఇంటి అద్దె అలవెన్స్(హెచ్‌ఆర్‌ఏ) వంటివి. వీటితోపాటు దివాలీ బోనస్, వార్షిక బోనస్ లాంటి ద్వారా కూడా ఐటీ మినహాయింపు పొందవచ్చును. ఆదాయ పన్ను చట్టం 80 సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు ఐటీ పన్ను మినహాయింపు కింద క్లెయిం చేసుకోవచ్చును.
Income
తాము సంపాదించిన మొత్తం ఆదాయంలో ఈ లక్షన్నర రూపాయలను క్వాలిఫైడ్ సెక్షన్ 80సీ కింద నేరుగా తగ్గించుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది. అలాగే వేతన జీవులు..ఇంటి అద్దె అలవెన్స్(హెచ్‌ఆర్‌ఏ)ను దాఖలు చేసి పన్ను క్లెయిం పొందవచ్చును. మొత్తం ఆదాయం-(హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు+80సీ సెక్షన్ కింద పెట్టిన పెట్టుబడులు)= పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రానున్నది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం గురించి తెలుసుకున్న తర్వాత ఏయే శ్లాబులు ఎంతమేర పన్ను చెల్లించేదానిపై ప్రస్తుతం తెలుసుకుందాం...

వీటితోపాటు ఆరోగ్య, విద్య సెస్ కింద మరో 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షలతోపాటు మరో రూ.1.5 లక్షల లోపు ఆదాయం కంటే ఎక్కువ సంపాదించిన దానిపై కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మిగులు ఆదాయం పన్ను నుంచి మినహాయింపు పొందే అవకాశాలు మాత్రం లేవు. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో మినహాయింపు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం బిల్లు(సెక్షన్ 80డీ), చికిత్స కోసం పెట్టే ఖర్చుపై(సెక్షన్ 80డీడీ), మెడికల్ ట్రిట్‌మెంట్(సెక్షన్ 80డీడీబీ), ఉన్నత చదువుల నిమిత్తం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ(సెక్షన్ 80ఈ), పలు చారిటబుల్ ట్రస్టులు, దేవాలయాలకు ఇచ్చే విరాశాల ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చును.

797
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles