ఏ ఫండ్లలో పెట్టుబడులు మేలు


Sat,January 26, 2019 12:54 AM

mutual-funds
ఇతర వాటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మేలని పలువురు ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. పుణెకు చెందిన 35 ఏండ్ల వయస్సు కలిగిన నిరంజన్ జోషి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ప్రయోజనం ఉండే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో భవిష్యత్తుపై ఆయనకు మంచి భరోసా లభించినట్లు అయింది. ఇది ఒక్క జోషి అభిప్రాయం కాదు..దేశవ్యాప్తంగా ఉన్న యువతి యువకులది. పదేండ్లక్రితం ఉద్యోగం ప్రారంభించిన నాటి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతున్న జోషికి మాత్రం.. ప్రస్తుతం వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో ఆయన ఆందోళన వర్ణనాతీతం. దీంతో ఆయన ఆలోచనల్లో మార్పులు మొదలయ్యాయి. కొద్దిమేర రిస్క్ ఉన్నప్పటికీ అధిక రిటర్నులు పంచేవాటివైపు పెట్టుబడులను మళ్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2014లో ఆయన చేతిలో మిడ్‌క్యాప్ షేర్లతోపాటు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినవి ఉన్నాయి. ఆ తర్వాతి క్రమంలో ఈక్విటీకి అనుసంధానం కలిగిన పొదుపు పథకాలపై తన పెట్టుబడులను బదలాయించారు.


ఎస్‌ఐపీలను నాలుగు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీంలుగా విడగొట్టే ఉద్దేశంలో భాగంగా ఈఎల్‌ఎస్‌ఎస్, లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్లులో ఇన్వెస్ట్ చేశారు. స్వల్పకాలం పాటు ఎలాంటి నిధులు అవసరం లేనివారు..భవిష్యత్తులో రిస్క్ ఉన్నదాంట్లో పెడితే అధిక రిటర్నులు పంచనున్నాయి. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే అధిక రిస్క్ ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టిన వారికి 10-11 శాతం రిటర్నులు లభించనున్నాయి. కానీ వీటికంటే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభంచేకూరింది. ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారు ఆర్థికంగా చాలా నష్టపోయారని, ఇదే సమయంలో ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినవారు లాభపడ్డారు. ద్రవ్యోల్బణం భయాలు స్టాక్ మార్కెట్లను చుట్టుముట్టడంతో స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి మదుపరులు జంకుతున్నారు. పనిచేసే సమయంలోనూ..పదవీ విరమణ చేసేవరకు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన వారి చేతిలోనే దీర్ధకాలికంగా ఉండనున్నదని, ద్రవ్యోల్బణ గణాంకాలు తీవ్ర ఆటుపోటులకు గురైనప్పుడు ఇవి ఆర్థికంగా సహాయం అందించనున్నాయి. పదవీ విరమణ చేసిన తర్వాత కనీసంగా 20 ఏండ్ల నుంచి 25 ఏండ్లపాటు ఈ పెట్టుబడులు ఆర్థికంగా దన్నుగా నిలువనున్నాయని ల్యాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజర్ వ్యవస్థాపకుడు సురేశ్ సదాగోపన్ తెలిపారు.


పదవీ విరమణ తర్వాత ఒకేసారి వచ్చే ఆదాయాన్ని వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఆయన సూచించారు. నెల నెల ఒక ఫిక్స్‌డ్ ఆదాయం వచ్చే మాదిరిగా ఇన్వెస్ట్ చేయాలని అప్పుడే వృద్యాప్య సమయంలో చిన్న చిన్న అవసరాల నిమిత్తం డబ్బుకు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు లేవు. ఒకవేళ స్థిర ఆదాయ సాధానాల్లో మొత్తం పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇదే సమయంలో రిస్క్ కూడా తప్పదని ఆయన హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరం కానున్నదని, కానీ ఉద్యోగ సమయంలో వీటిని చేరుకోవాలని సూచించారు. కానీ, రిటైర్‌మెంట్ తర్వాత చాలా మంది ప్రపంచ దేశాలను చుట్టి రావడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కొందరు వారి మనుమరాళ్ల వద్ద ఉండటానికి ఆసక్తి చూపుతుండగా, మరికొందరు ఈ సంపాదనలో సంక్షేమానికి బహుమతిగా అందచేయనున్నారు. చాలామంది తెలివిపరులు సరైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో సరాసరిగా స్మాల్‌క్యాప్ ఫండ్లు 20.37 శాతం నష్టపోగా, ఇదే సమయంలో మిడ్ క్యాప్ ఫండ్లు 14.06 శాతం తగ్గాయి. ఇదే సమయంలో అతిపెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి కేవలం 1.39 శాతం మాత్రమే నష్టపోయారు. లార్జ్‌క్యాప్ ఫండ్ ద్వారా సేకరించిన నిధులను 100 స్టాకులలో ఇన్వెస్ట్ చేయనున్నారు. అత్యధిక మంది ఆర్థిక సలహాదారులు..తమ పెట్టుబడులను లార్జ్‌క్యాప్ ఫండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు.
mutual-funds1

596
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles