ఏక్‌దమ్ ఎరీ సిల్క్!


Tue,February 5, 2019 10:22 PM

ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. రకరకాల ట్రెండ్స్ వచ్చి ఎప్పటికప్పుడు కొత్త సోయగాలను తీసుకొస్తాయి. ఇప్పుడు అలాంటి ట్రెండ్ ఒకటి వచ్చింది అదే. ఎరీ సిల్క్.
Eri-Fashion
రాబోయే సీజన్ సమ్మర్. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అవి ఎంత ఫ్యాషనేబుల్‌గా ఉండాలి? అనే విషయాలు డిజైనర్ల ఆలోచనల్ని మార్చేస్తుంటాయి. ఇప్పుడు ఎరీ సిల్క్ టైమ్ వచ్చేసింది. ఇది లేకుండా అస్సలు ఫ్యాషన్‌ను ఊహించలేం అంటున్నారు డిజైనర్లు. లాక్మే ఫ్యాషన్ వీక్ దీనికి వేదికగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ జ్యోతిరెడ్డి ఈ ఎరీ సిల్క్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ఎరీనా బ్రాండ్ పేరిట వస్తున్న డ్రెస్సులు ఇటు వింటర్‌లోనూ.. అటు సమ్మర్‌లోనూ వేసుకోవచ్చని ఎరీ సిల్క్ ప్రదర్శన సందర్భంగా జ్యోతి తెలిపారు. ఎరీ సిల్క్ ఏక్‌దమ్ ఫిట్ ఉంటుందనీ.. రాబోయేదంతా ఎరీ స్కిల్ ట్రెండేనని పలువురు ఫ్యాషన్ డిజైనర్లు పేర్కొన్నారు.

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles