ఎస్‌డబ్యూపీ క్రమశిక్షణతో విరమణ


Sat,January 26, 2019 12:57 AM

bank
మ్యూచువల్ ఇన్వెస్టర్లందరికీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్‌ఐపీ)లు సుపరిచితమే. ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న మ్యూచువల్ ఫండ్లలో ప్రతినెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడమే ఎస్‌ఐపీ. ఇన్వెస్టర్ల అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని మినహాయించుకునేందుకు మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఏఎంసీ) లేదా డిస్ట్రిబ్యూటర్‌కు ఆథరైజేషన్‌ను ఇవ్వడం ఎస్‌ఐపీలో ఒక పద్దతి. మార్కెట్ హెచ్చుతగ్గుదలతో సంబంధం లేకుండా ఎస్‌ఐపీల ద్వారా సగటు ధరకు ఫండ్లలో మదుపు చేస్తూ పోవడమే వ్యూహం. మార్కెట్ పతనం అయినప్పుడు మరిన్ని ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, మార్కెట్ పెరిగినప్పడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా సగటు ధరలో యూనిట్లను జమ చేయడం వల్ల దీర్ఘకాలంలో అపారమైన సంపదను సృష్టించడానికి వీలవుతుంది.


ఎస్‌ఐపీ మాదిరిగానే సిస్టమ్యాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కూడా ఉంది. ఇది చాలా తక్కువ మంది ఇన్వెస్టర్లకు మాత్రమే పరిచయం ఉన్న పద్ధతి. మరో రకంగా చెప్పాలంటే ఎస్‌ఐపీకి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇన్వెస్టర్ తాను మదుపు చేసిన మొత్తంలో ప్రతీ నెలా కొంత మొత్తానికి రీడీమ్ చేయాలంటూ ఏఎంసీకి ఆథరైజ్ చేయడమే ఎస్‌డబ్ల్యూపీ.


రిస్క్-రివార్డ్‌లను నియంత్రించడం

మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావానికి ఇన్వెస్టర్లు ప్రభావితం కాకుండా ఉండటమే ఎస్‌ఐపీ లేదా ఎస్‌డబ్ల్యూపీ పద్దతుల్లోని విశిష్టత. మదుపు చేసిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా క్రమపద్దతిలో వరుసగా కొంత కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమే ఎస్‌డబ్ల్యూపీ. ఉదాహరణకు ఇన్వెస్టర్ ఎవరైనా సరే రూ. 10 లక్షల వరకు మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేశారని అనుకుందాం. అయితే మార్కెట్ పతనం కారణంగా ఫండ్ ఎన్‌ఏవీ 30 శాతం మేర నష్టపోయింది. దాంతో ఆ ఇన్వెస్టర్‌కు భారీ నష్టమే వాటిల్లితుంది. మళ్లీ పూర్తి స్థాయిలో రికవరీ అయ్యే వరకూ వేచి ఉండాల్సిందే. ఒకవేళ మదుపు చేసిన మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకున్నట్టయితే, మార్కెట్ ఆ తర్వాత పెరిగితే వచ్చే లాభాలను కోల్పోయినట్టు అవుతుంది.


ఎస్‌డబ్ల్యూపీ రకాలు

ఎస్‌డబ్ల్యూపీ సాధారణంగా రెండు రకాలు. మొదటిది ఫిక్స్‌డ్ విత్‌డ్రాయల్.. రెండోది అప్రిసియేషన్ విత్‌డ్రాయల్. ఫిక్స్‌డ్ విత్ డ్రాయల్‌లో ఒక మొత్తానికి సమానమైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ప్రతి నెలా రీడిమ్ లేదా అమ్మేసి ఇన్వెస్టర్ అకౌంట్‌లో జమ చేస్తారు. అప్రిసియేషన్ పద్దతిలో అయితే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిపై వచ్చిన రాబడికి సమానమైన మొత్తాన్ని మాత్రమే రీడీమ్ చేయవచ్చు.


రిటైర్మెంట్ ఆదాయానికి ఉత్తమం

మదుపు చేసిన మొత్తం నుంచి క్రమ క్రమంగా నిర్ణీత కాలాల్లో ఉపసంహరించుకోవడం ఎస్‌డబ్ల్యూపీ అనుకున్నారు. ఈ పద్దతి మనకు రెగ్యులర్ ఆదాయ వనరులు లేని సమయంలో ఇన్వెస్ట్‌మెంట్లపైనే మాత్రమే ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రిటర్మెంట్ తర్వాత నెల నెలా ఆదాయానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. మీ పెట్టుబడులను పూర్తిగా విరమించుకోకుండా మీకు అవసరమైనంత అవసరమైన సమయాల్లో రీడిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్ల యూనిట్లను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఎఫ్‌ఐఎఫ్‌ఓ) ప్రతిపాదికన విరమించుకోవచ్చు. అంటే తొలుత కొనుగోలు చేసిన యూనిట్ల ముందుగా రీడిమ్ చేసుకోవడం. దీనివల్ల ఆదాయ పన్ను కూడా ప్రయోజనాలను కూడా పొందే వీలుంటుంది.


ఎస్‌డబ్ల్యూపీలు - ఆదాయం పన్ను

మ్యూచువల్ ఫండ్ల రిడెంప్షన్‌లకు వర్తించే పన్ను నిబంధనలే ఎస్‌డబ్ల్యూపీలకు కూడా వర్తిస్థాయి. ప్రతిపాదికనే రీడిమ్ చేసుకోవాలి. అయితే ఆదాయ పన్ను చెల్లింపులు మ్యూచువల్ ఫండ్ల కాలపరిమితి, ఫండ్ లక్షణాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ రీడిమ్ చేసుకున్న యూనిట్లు సంవత్సరంలోపే కాలపరిమితి ఉంటే ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను(ఎస్‌టీసీజీ) 15.45 శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే సంవత్సరం పైబడి కాలపరిమితి ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రీడిమ్ చేస్తే పది శాతంకు పైగా వచ్చే రాబడులపై దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్నును 10 శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డెట్ మ్యూచువల్ ఫండ్ అయితే మూడేండ్ల వరకూ ఎస్‌టీసీజీ నే వర్తిస్తుంది. మూడేండ్ల పైబడి ఉండే ఫండ్లపై 20.6 శాతం ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఎల్‌టీసీజీని చెల్లిం చాల్సి ఉంటుంది.


క్రమశిక్షణ అవసరం..

క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్‌కు క్రమశిక్షణతో కూడిన రిడెంప్షన్లు కూడా అవసరమే. ఇలాంటి సందర్బాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినవే ఎస్‌డబ్ల్యూపీలు. మదుపు చేసిన మొత్తంపై రాబడులను పొందుతూనే వాటిని విత్ డ్రా చేసుకునే వీలు కల్పించేవే ఎస్‌డబ్యూపీలు.

bank1
అదిల్ శెట్టి
సీఈఓ, బ్యాంక్ బజార్ డాట్ కామ్

334
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles