ఎసిడిటీ బాధిస్తున్నదా?


Mon,February 4, 2019 01:21 AM

ఏం తిన్నా గొంతులో పట్టేసినట్లుంటుందా? కారం తింటే కడుపు మంట పుడుతుంటే మీకు ఎసిడిటీ ఉన్నట్లే. ఇలాంటప్పుడు తక్షణమే కొన్ని పనులు చేస్తే తప్ప ఉపశమనం పొందలేరు. అదెలాగో చదువండి.
acidity
-పరిగడుపున నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగాలి. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తాయి.
-భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు.
-అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ అంటాసిడ్స్ ఉండి గుండె మంట నుంచి ఉపశమనం కల్పిస్తాయి. జీర్ణకోశం శుభ్రపర్చడానికి అరటిపండు ఉపయోగపడుతుంది.
-పాలలో ఒక చెంచా తేనె చేర్చి తీసుకోవడం వల్ల ఛాతిలో, కడుపులో మంట తగ్గుతుంది.
-రెండు లవంగాలను నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

831
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles