ఎలా పనిచేస్తుందంటే..?


Wed,January 23, 2019 01:29 AM

Smart-Ride
మిషన్ స్మార్ట్ రైడ్‌కు సపోర్ట్‌గా మిషన్ స్మార్ట్ వెయిటర్ యాప్ కూడా రూపొందించారు. ముందుగా ఆ యాప్‌లో మీ వివరాలు నమోదు చేసుకోవాలి. బార్లు, రెస్టారెంట్లలో పనిచేసే వెయిటర్లకు మిషన్ స్మార్ట్‌రైడ్ వారు శిక్షణ కూడా ఇస్తున్నారు. మీరు డ్రింక్ ఆర్డర్ తీసుకునేటప్పుడు వెయిటర్ మిమ్మల్ని స్మార్ట్‌రైడ్, స్మార్ట్ డ్రైవర్ కావాలా అని అడుగుతాడు. మీరు మొదటి డ్రింక్ తీసుకునేటప్పుడు టైం నోట్ చేసుకుంటాడు. ఇలా ప్రతీ డ్రింక్‌కు కౌంట్ చేస్తాడు. మీరు చెప్పిన లిమిట్ దాటిన తర్వాత ఆటోమెటిక్‌గా తన దగ్గర ఉన్న యాప్‌తో మీకు క్యాబ్ లేదంటే డ్రైవర్‌ను బుక్ చేసి మిమ్మల్ని భద్రంగా ఇంటికి వెళ్లేలా చూస్తారు. క్యాబ్స్‌లో ఓలా, ఉబర్ కంపెనీలతో మిషన్‌స్మార్ట్ రైడ్ తరఫున ఎంఓయూ చేసుకున్నారు. రెండో రైడ్ నుంచి ప్రతీ రైడ్‌కు 20శాతం డిస్కౌంట్ ఇస్తారు. మిషన్ స్మార్ట్ రైడ్ యాప్ లేకుండా కూడా నేరుగా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు అందులో పేమెంట్ ఆప్షన్ దగ్గర మీరు ఐప్లె డిస్కౌంట్‌లోకి వెళ్లి డిస్కౌంట్ కోడ్ కొడితే సరిపోతుంది. ఓలా క్యాబ్ బుక్ చేసుకునే వాళ్లు ఎంఎస్‌ఆర్ 150కోడ్ ఎంటర్ చేయాలి. అదే ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే వాళ్లు ఎంఎస్‌ఆర్ 2018అని కోడ్ ఎంటర్ చేసి ఆప్షన్ క్లిక్ చేస్తే ఎంఎస్‌ఆర్ డిస్కౌంట్ వర్తిస్తుంది. కారుంటే డ్రైవర్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

464
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles