ఎలా గుర్తించాలి?


Tue,January 9, 2018 11:56 PM

Zheng
నా వయసు 34 సంవత్సరాలు. ఓ ప్రైవేట్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా ప్రయాణాలు చాలా ఎక్కువ. బైక్ మీద తిరుగుతుంటాను. పెరుగుతున్న కాలుష్యంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతున్నదని, ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం చెయ్యడం సాధ్యమేనని విన్నాను. పురుషుల్లో క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించడం ఎలాగో దయచేసి వివరంగా తెలియజేయగలరు.
నరేందర్, మల్కాజ్‌గిరి

త్వరగా గుర్తిస్తే క్యాన్సర్‌కు పూర్తి స్థాయిలో చికిత్స సాధ్యమే. పురుషుల్లో రకరకాల క్యాన్సర్లు రావచ్చు. వాటిలో ముఖ్యమైన భాగాలు
వృషణాలు : వృషణాల ఆకృతిలో మార్పు గడ్డలా లేదా వాపు కనిపించ వచ్చు.
రొమ్ము: స్త్రీలలోనే కాదు పురుషుల్లోనూ ఈ క్యాన్సర్ రావచ్చు. రొమ్ము భాగంలో చర్మంలో గుంట లేదా ముడత కనిపించి చనుమొనలు ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఊపిరితిత్తులు : సాధరణ దగ్గు మాదిరిగానే ఉంటుంది. 3,4 వారాలు దాటినా దగ్గు తగ్గకపోతే అనుమానించాల్సిందే. దగ్గుతో పాటు ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. సిగరెట్ అలవాటున్న వారు తరచుగా పరీక్షలు చేయించుకోవడం మంచిది.

జీర్ణవ్యవస్థ: మింగడంలో కష్టంగా ఉండడం, తీవ్రమైన నొప్పి ఉంటే అన్న వాహిక క్యాన్సర్ కావచ్చు. లేదా గ్యాస్ట్రో ఎంటైస్టెనల్ కాన్సర్లలో ఏదైనా కావచ్చు. మింగడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
nikhil

311
Tags

More News

VIRAL NEWS