ఎలాగంటే?


Mon,February 4, 2019 10:47 PM

Elagante
చంద్రబింబం సూర్యునిలా ఎప్పుడూ ఒకలా ఉండక పోవడానికి కారణం అది మన భూమి చుట్టూ తిరుగుతుండడమే. నెలలో సగం రోజులు ఒకవైపు (సూర్యుని వైపు), మిగిలిన సగం రోజులు వ్యతిరేక దిశవైపు (సూర్యునికి ఎదురుగా) వస్తుండడం వల్ల చంద్రకళలు ఏర్పడుతుంటాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. చంద్రుడు సూర్యుని వైపు ఉన్నపుడు సూర్యకాంతి వల్ల చందమామ మనకు రోజుకింత పరిమాణంలో కనిపించకుండా పోతుంది. పూర్తిగా బింబం సూర్యునివైపే వచ్చినప్పుడు అమావాస్య (new moon), సూర్యునికి ఎదురుగా వచ్చినపుడు పూర్ణిమ (full moon) ఏర్పడతాయి. ఇక, చంద్రుడు భూమిచుట్టూ ఒకసారి తిరిగి రావడానికి చాంద్రమాసం (synodic) ప్రకారం 29.53 రోజులు, నక్షత్రమాసం (sidereal) మేరకు రెండు రోజులు తక్కువగా 27.32 రోజుల సమయం పడుతుంది.

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles