ఎలాగంటే?


Mon,September 10, 2018 11:13 PM

Elagante
సముద్రం లోతు కొలవడం సామాన్యులకు అర్థం కాని విషయం. ఒక్కోచోట ఒక్కో అంత లోతును కలిగి ఉంటుంది. గతంలో ఒక పెద్ద తాడుకు ఓ చివర గంట కట్టి నీళ్ల లోపలకు వదిలేవారు. సముద్రగర్భంలో నేల తాకగానే ఆ గంట మోగేది. ఇది అంత కచ్చితంగా ఉండేది కాదు కూడా. ఎందుకంటే, కెరటాలు, ప్రవాహాల వల్ల తేడా వచ్చేది. ఆ తర్వాతి కాలంలో ధ్వని తరంగాల ఆధారంగా సముద్రం లోతు కొలవడం మొదలైంది. దీనికి ఎకో సౌండర్ అనే పరికరం ఉపయోగిస్తారు. ఇలా.. ఇప్పుడు నీటి ఉపరితలం నుండి అడుగు దాకా ఎత్తును శాస్త్రీయంగా కొలుస్తున్నారు. ఓడలలో ఈ పరికరాన్ని ఉంచి ధ్వని తరంగాల ఆధారంగా సముద్రంలో ఎక్కడంటే అక్కడ, ఎంత లోతు ఉందో తెలుసుకోగలుగుతున్నారు.

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles