ఎలాగంటే? గ్రహశకల పట్టీకి మూలం?


Tue,February 19, 2019 01:34 AM

Elagante
మన భూమి తర్వాతి గ్రహమైన అంగారకుని (కుజుడు), ఆ తర్వాతి గ్రహం గురుని కక్ష్యల మధ్య గ్రహశకలాల పట్టీ (asteroids belt) సూర్యుని చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. సౌరవ్యవస్థ గ్రహశ్రేణిలోని నట్టనడుమ ఇలాంటి శకలాల గుంపు, అదీ అవన్నీ కలిసి ఒకే స్థిరమైన కక్ష్యలో ఎందుకు, ఎలా ఏర్పడ్డాయన్న దానిపై శాస్త్రవేత్తలకు ఇంకా స్పష్టత రాలేదు. ఈ రెండు గ్రహాల నడుమ ఓ గ్రహం వుండేదని, అది విచ్ఛిన్నమవడం వల్లే ఈ శకలాల గుంపు ఏర్పడిందని కొందరు భావిస్తుంటే, అవన్నీ అలా ఒకేచోట, ఒకే సమయంలో ఉద్భవించి వుండక పోవచ్చునని ఇంకొందరు అంటున్నారు. ఆవలివైపుకు భారీ వాయుగోళ గ్రహాలు (గురు, శని, యురెనస్, నెప్ట్యూన్), సూర్యుని వైపు భౌగోళిక గ్రహాలు (కుజుడు, భూమి, శుక్రుడు, బుధుడు) ఉన్నాయి. వీటిని విభజిస్తున్న సరిహద్దులా ఈ బెల్ట్ ఉండడం విశేషం. మొదట్లో ఈ పట్టీలో పెద్ద శకలాలున్నా రాన్రాను గురుని గురుత్వశక్తి వాటి ద్రవ్యరాశిని లాగేసుకొని వుంటుందని 2017లో ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్ (University of Bordeaux) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పట్టీలోని మొత్తం శకలాల ద్రవ్యరాశి మన చంద్రుని ద్రవ్యరాశిలో కేవలం 4 శాతమే ఉంటుందని, వాటి సగటు చుట్టుకొలత 400 కి.మీ. మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

220
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles