ఎన్నారై టీఆర్‌ఎస్.. ఎవ్రీథింగ్ సక్సెస్!


Wed,December 26, 2018 01:55 AM

ఉన్నత విద్యల కోసం.. ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు వేలమంది ఉన్నారు.కానీ వీళ్లు అందరిలాంటి తెలంగాణ బిడ్డలు కారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో స్పందించిన వాళ్లులండన్ బ్రిడ్జి మీద, నది ఒడ్డున గులాబీ జెండాను ఎగురవేసిన యువకులు తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని అప్పుడు, బంగారు తెలంగాణ రావాలని ఇప్పుడు ప్రతిక్షణం కేసీఆర్ వెంట ఉండి అడుగులు వేస్తున్నారు ఉద్యమం నుంచి మొదలు సామాజిక సేవ వరకు తమవంతుగా ఏదో ఒక కార్యక్రమానికి విజయవంతంగా పనిచేస్తున్నారు ఎనిమిదేళ్ల ఎన్నారై టీఆర్‌ఎస్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
GroupPic
టీఆర్‌ఎస్ పార్టీకి ఒక ఎన్నారై విభాగం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ సంస్థను లండన్ వేదికగా 2010 నవంబర్ 30న మొదలుపెట్టారు.. ఇది కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్‌లో వెబ్‌సైట్ ప్రారంభించడంతో శాఖ సేవలు ప్రారంభమయ్యాయి. అనిల్ కూర్మాచలం 2009లో ఉపాధి కోసం లండన్‌కు వెళ్లాడు. అప్పటికీ ఇంకా ఫేస్‌బుక్ రాలేదు. వాట్సప్ లేదు. ఈమెయిల్ గ్రూప్స్ అనే సర్వీస్ ఉండేది. వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు ఈమెయిల్ గ్రూప్స్ స్థాపించి చర్చలు చేసేవారు. సమస్యల మీద స్పందించేవారు. అందరిలాగే అనిల్ కూడా చర్చల్లో పాల్గొనేవాడు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, టీఆర్‌ఎస్ కార్యకర్తగా ఉండి ఉద్యమాలు చేశారు.

విదేశాల్లో ఎన్ని ఎన్నారై సంస్థలు ఉన్నా పార్టీకే ఒక ఎన్నారై ఉంటే బాగుంటుందనే ఆలోచన చేశారు. అందరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నరు. చర్చిస్తున్నరు. కానీ కొన్ని సందర్భాల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం, విమర్శించడం, తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ల కుట్రలను తిప్పి కొట్టాలంటే ఒక సంస్థ ఉండాలనుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా సాధ్యమవుతుందని భావించారు. పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభావితం చేయగలిగితే బాగుంటుందని అనుకున్నారు. అది కేవలం టీఆర్‌ఎస్ వల్ల సాధ్యమవుతుందని నమ్మారు. అందుకే తెలంగాణ రాష్ట్రసమితికి అంతటా సంస్థలుండాలని అనుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి కూడా ఎన్నారై శాఖ ఉంటే విదేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమ గొంతును వినిపించవచ్చనుకున్నారు.
NRI-TRS
వ్యక్తులెప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థ, సంస్థ ఉంటే చిరకాలం ఉంటుందనే దీన్ని పెట్టారు. దీనిద్వారా తెలంగాణకు కావాల్సిన ప్రతి అంశాన్ని అందించాలనుకున్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ శాఖను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అప్పట్లోనే ఫ్రొఫెసర్ జయశంకర్ సార్‌తో చర్చించారు. తనకున్న ఆలోచనలను పంచుకున్నారు. లండన్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలు ఎవరైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా వివరాలను ఇచ్చి ఎన్నారై టీఆర్‌ఎస్‌లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఒక్క అడుగుతో ప్రారంభమైన ప్రయత్నం అది చివరికి ఒక రాజకీయ శక్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో తెలంగాణ బిడ్డలున్నారు. ఎక్కడెక్కడో ఉన్నోళ్లంతా జై తెలంగాణ అంటున్నరు. కానీ అన్ని నినాదాలు కలిపి ఉద్యమంగా చేసే ఒక వేదికను కల్పించాలనుకుని ఈ సంస్థను స్థాపించారు. సైన్యంగా మారి ఉద్యమంలో తమవంతు కృషిని అందించాలనుకున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్‌కు ఫోన్ చేసి చర్చించారు. ఇదొక మంచి ఆలోచన అని వెంటనే కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిని కలిపించారు. చివరకు కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించి ఎన్నారై టీఆర్‌ఎస్‌కు బీజం వేశారు.

ఆ తర్వాత ఎంపీ కవిత బాధ్యతగా తీసుకొని ఎన్నారై టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. లండన్ వేదికగా ప్రారంభమైన ఎన్నారై టీఆర్‌ఎస్ శాఖ అమెరికా, బెహరెన్, యూరప్, అరబ్ దేశాలతో కలిపి ఇప్పుడు 30 దేశాలకు విస్తరించింది. ఒక్క వ్యక్తితో ప్రారంభం అయిన ఈ సంస్థలో సుమారు మూడు వేల మంది సభ్యులుగా ఉన్నారు. ఇది ఎన్నారై టీఆర్‌ఎస్ సాధించిన విజయంగా వారు భావిస్తున్నారు. తెలంగాణలో ఉద్యమం జరుగుతున్న సమయంలో క్రీయాశీలంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా లండన్ వీధుల్లో ర్యాలీలు తీశారు. ఉద్యోగాలు చేసుకుంటూ, ఉన్నత విద్యలు చదువుకుంటూ, కుటుంబాలను చూసుకుంటూ తెలంగాణలో ఏం జరిగినా వచ్చి తమ వంతుగా పనిచేస్తున్నారు. గత ఎనిమిది సంవ్సతరాలుగా కేసీఆర్ పుట్టిన రోజుకు రక్తదాన శిబిరాలు చేపడుతున్నారు. లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున గులాబీ జెండాను రెపరెపలాడించారు. తెలంగాణ భాషను, సాహిత్యాన్ని, యాసలను అక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నారు.
WhatsAp
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్నారై టీఆర్‌ఎస్‌సెల్ తరపున ప్రచారం చేశారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఈసారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లండన్ నుంచి వచ్చి 80 నియోజకవర్గాలు తిరిగి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రచారం చేశారు. తెలంగాణ నాడు - నేడు అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని 30 నిమిషాల వీడియో డాక్యుమెంటరీని రూపొందించారు. కేసీఆర్ పాలన మీద, గత పాలకుల మీద ఈ వీడియో క్లుప్తంగా కళ్లకు కట్టినట్టు ఉంటుంది. ప్రత్యక్ష ప్రచారమే కాకుండా ఆన్‌లైన్ ప్రచారం, వీడియోలు చేసి తెలంగాణ మీద బాధ్యతను చాటుకున్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో సోషల్‌మీడియాలో ఉద్యమం చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించారు. వేలియెట్ వారియర్ ఆఫ్ తెలంగాణ పేరుతో ప్రోత్సహకాలను అందజేశారు. సర్టిఫికెట్ అందజేశారు.
DSC
ఆ సర్టిఫికెట్ మీద కేసీఆర్‌తో సంతకం చేయించారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు నినాదం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న పథకాలను తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అక్కడ తెలంగాణ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా అనిల్ కూర్మాచలం ఆధ్వర్యంలో ప్రారంభమైన లండన్ ఎన్నారై టీఆర్‌ఎస్‌కు రాజ్‌కుమార్ శానబోయిన, పోచారం సురేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్ దూసరి, నవీన్‌రెడ్డి, రత్నాకర్ కడుదుల, చంద్రశేఖర్‌గౌడ్, శ్రీకాంత్ పెద్దిరాజు, మల్లేష్ పప్పుల, పొన్నోజు రాజేష్, ప్రవీణ్ పంతులు, సుభాష్‌లు సేవలందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనైనా, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనైనా ఎన్నారై టీఆర్‌ఎస్ కీలకంగా పనిచేస్తున్నది.

కేసీఆర్ పుట్టిన రోజుకు రక్తదానాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు నిధులను సేకరించారు. లండన్ బ్రిడ్జ్ దగ్గర తెలంగాణ వాదులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమంపై చర్చ పెట్టారు. ఒలింపిక్స్‌లో జాతీయ జెండాతో పాటు గులాబీ జెండాను ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటారు. క్రికెట్ స్టేడియాల్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఫ్లకార్డ్‌తో వెళ్లి నినాదాలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ మీద దృష్టిని ఆకర్షించారు. లండన్‌లో బోనాల పండుగ చేశారు. బతుకమ్మ ఉత్సవాలు జరిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ తరపున వివిధ గ్రామాల్లో ఉన్న మూడు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ కూడా పంపిణీ చేశారు. స్టడీ మెటిరీయల్స్ ఇచ్చారు. హరితహారమైనా, స్వచ్ఛ తెలంగాణ అయినా కార్యక్రమం ఏదైనా సందర్భం ఇంకేదైనా స్పందిస్తారు.

1160
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles