ఎత్తు తక్కువ ఉన్నా..


Fri,January 18, 2019 01:45 AM

పొట్టిగా ఉన్నారని చింతిస్తున్నారా? మీరు వేసుకునే బట్టలను బట్టి మీరు ఉన్నదానికంటే కాస్త ఎత్తుగా ఉన్నట్లు కనిపించవచ్చు. అదెలాగో ఇది చదివితే మీకే తెలుస్తుంది.
short
-ఎత్తు తక్కువ ఉన్నవారు పొడుగ్గా కనిపించాలని హై హీల్స్ వేసుకుంటారు. అవి మాత్రమే వేసుకుంటే సరిపోదు. గీతలున్న దుస్తులను ధరిస్తే కాస్త హైట్‌గా కనిపించొచ్చు.
-చిన్న పువ్వులు, ప్రింట్లు, తక్కువ అల్లికలున్న వస్ర్తాలు మిమ్మల్ని మరింత ఎత్తుగా కనిపించేలా చూసుకోవాలి. ఇలాంటి డిజైన్లు కూడా ఒకే రంగులో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
-చీరలు ధరిస్తున్నప్పుడు.. పెద్ద అంచులున్నవి కాకుండా చిన్నగా ఉండేవి ఎంచుకోవాలి. సన్న పింట్ ఉన్నవి అయితే మరింత బాగా నప్పుతాయి.
-జీన్స్ ఏవో ఒకటి కాకుండా.. కప్డ్ రకాలను కొనడం మేలు. వీటి మీదకి హై హీల్స్ వేసుకుంటే నలుగురిలో స్పెషల్ లుక్ సొంతమవుతుంది.
-నిలువు గీతలున్న టాప్‌ల కంటే.. అడ్డం గీతలున్న టాప్‌లను ధరించాలి. కాంట్రాస్ట్ రంగులు ఉండే డ్రెస్‌లు, టాప్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.

635
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles