ఎక్కితే వెళ్లిపోయే బస్సు!


Wed,February 6, 2019 01:14 AM

solar-bus
బస్సు ఎక్కగానే మనకు డ్రైవర్ కనిపిస్తాడు. తెలిసిన వాడైతే నవ్వుతూ పలుకరిస్తాడు. ఎక్కిన తర్వాత బస్సు కదులాలంటే గేర్ వేయాలి, క్లచ్ తొక్కాలి, ఎక్సలేటర్ ఇవ్వాలి. ఇవన్నీ జరుగాలంటే బస్సులో ఇంధనం పోయాలి. కానీ ఈ బస్సుకు అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్.. ఎక్కితే చాలు.. వెళ్లిపోతుంది.


మనోళ్లు మామూలోళ్లు కాదు. టెక్నాలజీ అంతు చూడడంలో కాకలు తీరిన టెక్నాలజీ వీరులతో సైతం తలపడుతున్నారు. రాజస్థాన్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సౌరశక్తితో కదిలే డ్రైవర్‌లెస్ బస్సును తయారుచేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన వర్క్‌షాప్‌లో 300 మంది విద్యార్థులు, 50మంది అధ్యాపకులు కష్టపడి ఈ సోలార్ బస్సును రూపొందించారు. ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఆ తర్వాత బస్సు టాప్‌లో ఉన్న సోలార్ ప్యానెల్‌తో నిత్యం ఛార్జ్ అవుతూనే ఉంటుంది. కేవలం రూ.15 లక్షల ఖర్చుతోనే ఈ బస్సు రూపొందించడం విశేషం.

424
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles