ఎందుకంటే?


Thu,January 10, 2019 10:56 PM

Endukante
ఉత్తరాయణం పుణ్యకాలమని హైందవ గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే, దేవతలకు ఇది పగటి సమయం కనుక. వారు ఈ కాలంలో మేల్కొని ఉంటారు. వారికి దక్షిణాయణం రాత్రి వేళ. కర్కాటక సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు 6 నెలలు దక్షిణాయణం. కాగా, మకర సంక్రాంతి నుంచి మళ్లీ కర్కాటక సంక్రమణం దాకా 6 నెలలు ఉత్తరాయణం అంటారు. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. మకరరాశిలోకి సూర్యుడు మారతాడు కాబట్టి, ఈ పర్వదినాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. సూర్యుడు ప్రతి సంవత్సరం జనవరి 15న ఉత్తరాయణ పథంలోకి అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గలోక ద్వారాలు తెరచుకొని ఉంటాయని, అందుకే ఈ కాలమంతా పుణ్యప్రదమనీ వేద పండితులు అంటారు. మహాభారత కాలంలో భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ప్రాణాలు వదలగా, ఆది శంకరాచార్య సన్యాసాశ్రమాన్ని ఇదే రోజు స్వీకరించారనీ చెప్తారు. ఇక, ఇదే సమయంలో వచ్చే పుష్యశుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా పిలుస్తారు.

583
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles