
దాంపత్యం ఒక స్నేహం. భార్యాభర్తలు ఒకరి కొకరుగా, సరిసమాన రీతిలో మనసులను ఇచ్చిపుచ్చుకోవాలి. ఇద్దరూ ఎల్లవేళలా స్నేహపూర్వకంగా మెలగాలి. పరస్పర ప్రోత్సాహంతో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన దాంపత్యం. అందుకే, పురుషుడికి నిజమైన నేస్తం భార్యే అని మహాభారతంలో యక్షప్రశ్నలకు సమాధానాలిస్తూ ధర్మరాజు అంటాడు.