ఎండ నుంచి సాంత్వననిచ్చే మజ్జిగ


Tue,March 12, 2019 01:26 AM

butter-milk
- ఇది పరీక్షల కాలం. పిల్లలు అనారోగ్యం బారిన పడే కాలం కూడా.. పరీక్షలు ఉన్న నేపథ్యంలో పిల్లలు ఎక్కువ సమయం చదువడం వల్ల వారికి పైత్యం ఏర్పడుతుంది. దీనిని తగ్గించడానికి మజ్జిగలో పటికబెల్లం కలిపి ఇస్తే మంచిది.
- సాధారణంగానే కొందరికి నిద్ర పట్టదు. అందులో ఎండాకాలం ఉక్కపోత వల్ల చాలామంది ప్రత్యక్ష నరకంగా భావిస్తారు. నిద్రసరిగ్గా పట్టనివారు మజ్జిగలో పెద్ద ఉల్లిపాయను పేస్ట్‌లా చేసి కలిపి నిద్రపోయే గంట ముందు తీసుకుంటే బాగా నిద్రపోతారు.
- చాలా మందికి ఎండాకాలంలో కొంత తిన్నా అరగకపోవడం, వాంతి రావడం జరుగుతుంటుంది. మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. మజ్జిగను పలుచగా వెన్న తీసి ఎక్కువగా తాగితే మంచిది.
- పిల్లలు ఎండాకాలంలో కొద్ది దూరం నడిచినా, చిన్న చిన్న ఆటలు ఆడినా ఇట్టే అలిసిపోతుంటారు. తక్షణ ఎనర్జీ కోసం మజ్జిగలో నిమ్మరసం కలిపి తాగిస్తే పిల్లలకు నీరసం రాకుండా ఉంటుంది.
- ఎంత తిన్నా పిల్లలకు రక్తం శాతం తక్కువగానే ఉంటుందని ఏవేవో టానిక్‌లు వాడుతుంటారు. రక్తం శాతం తక్కువగా ఉన్న పిల్లలకు పండ్ల రసాలతో పాటు, కరివేపాకు కలిపిన మజ్జిగను ఇవ్వడం వల్ల
రక్తంవృద్ధి చెందుతుంది.

1113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles