ఎండాకాలం చర్మ సంరక్షణ ఇలా


Thu,March 7, 2019 12:08 AM

summer
-డీ హైడ్రేషన్ వల్ల కూడా చర్మం కందిపోయే అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకుంటే మంచిది.పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కూడా చర్మ సంరక్షణ బాగుంటుంది.
-ఎండలో బయటికి వెళ్లే ముందు ముఖం, చేతులు, మెడ భాగాలకు సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. వీలైనంత తలకు టోపీ లేదా రుమాలు, స్కార్ఫ్ వాడితే ఎండబారి నుంచి తప్పించుకోవచ్చు.
-పాలల్లో నాలుగు బాదం పప్పు గింజలు వేసి ఏడెనిమిది గంటలు నానిన తర్వాత నీటిని మెత్తగా పేస్టులా చేసి, రెండు చెంచాల పాల మీగడ, కొంచెం రోజ్ ఎసెన్స్ లేదా పది చుక్కల రోజ్‌వాటర్ కలిపి పడుకోబోయే ముందు మొహానికి రాసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది.
-జిడ్డు చర్మం ఉన్నవారు చల్లటి నీటితో ముఖాన్ని రోజుకు అయిదారు సార్లు కడుక్కోవాలి. అలాగే ఒక మగ్ చల్లని నీటిలో నిమ్మరసాన్ని పిండి మొహానికి అద్దుకున్నా, లేదా శనగపిండి, పెసరపిండిలో పాలమీగడ కలిపి చర్మాన్ని శుభ్రపరుచుకున్నా వేసవి సమస్యల నుంచి బయటపడొచ్చు.
-సాధ్యమైనంత వరకు వేసవిలో లేతరంగు బట్టలు ధరించడం మంచిది. వేసవిలో జీన్స్ ప్యాంట్ల జోలికి పోకుండా ఉంటే మంచిది.

361
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles