ఎండలోనూ చర్మం నిగారింపు


Sun,April 21, 2019 12:43 AM

జిడ్డు చర్మంతో బాధపడే వారు ఎండకు వెళ్తే మరింత జిడ్డుగా తయారవుతారు. లేనిపోని క్రీములెన్ని పెట్టినా ఫలితం కనిపించదు. ఎండాకాలం క్రమంగా ముఖం కాంతి హీనంగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి..
glow-face
-కీరాని ప్రతిరోజు ఉదయాన్నే ముఖానికి రుద్దినైట్లెతే జిడ్డు పోతుంది. కీరా రసంలో కాస్త ముఖానికి రాసుకునే పౌడర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే జిడ్డును తగ్గించి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇలా క్రమంగా ఒక నెల రోజులు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
-టమాటా రసం ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరిస్తే జిడ్డు తొలిగిపోతుంది. టమాటాలో కాస్త ఓట్స్ కలిపి మిక్స చేసిన మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపర్చాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజులో నాలుగైదు సార్లు చన్నీటితో ముఖం కడుక్కోవాలి.
-ముఖాన్ని శుభ్రపరిచేందుకు సబ్బుకు బదులుగా శనగపిండి వాడితే మంచిది. దీని మూలంగా జిడ్డు తగ్గించడంతో పాటు ముఖం కూడా ప్రకాశవంతంగా అందంగా ఉంటుంది. మజ్జిగను ముఖంపైన ఐప్లె చేసి కొంత సేపటి తర్వాత శుభ్రపరిస్తే జిడ్డును తగ్గిస్తుంది.
-కీరా రసం, నిమ్మరసం, చందనం పొడి, బాదాం పౌడర్, పెరుగు, బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకుని వాటిని ముఖానికి పట్టించి కొంతసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే జిడ్డు తగ్గుతుంది.

397
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles