ఊరంతా నిద్రలోకి..


Thu,December 27, 2018 12:34 AM

sleep
కొందరు మాట్లాడుతూ.. మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటారు. కానీ ఈ ఊర్లో ఒక్కరు ఇద్దరు కాదు ఊరు ఊరంతా ఉదయం, సాయంత్రం అనే భేదం లేకుండా నిద్రలోకి జారుతున్నారు. ఎందుకిలా?


రాత్రి అయితే నిద్ర ముంచుకొస్తుంది ఎవరికైనా! కానీ ఆ ఊరిలో అడుగుపెట్టిన ఎవ్వరికైనా నిద్ర అలా ముంచుకొచ్చేస్తుంది. శరీరం ఎంత నియంత్రించుకోవాలన్నా కూడా అది సాధ్యం కాదు. కొన్ని క్షణాలు ఏం జరుగుతుందో తెలియకుండానే.. మంచి నిద్ర పట్టేస్తుంది. ఆ మత్తులో ఎప్పుడు.. ఎక్కడ పడుకున్నామనేది కూడా తెలియదు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్రపోతున్నారట. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది కదూ! ఇంతకీ ఆ ఊరేంటో.. ఎక్కడుందో అని ఆలోచిస్తున్నారా? కజకిస్థాన్‌లోని కలాచీ గ్రామంలో ఇలా జరుగుతున్నది. ఈ నిద్ర సమస్య (స్లీపింగ్ డిజార్డర్) వల్ల ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారట. నడుస్తూ నడుస్తూ నిద్రలోకి జారుకుంటున్నారు. నిద్ర నుంచి లేచాక కూడా ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతారట. కొంతమందైతే ఒకటి, రెండు రోజులైనా నిద్రలేవకుండా పడుకొనే ఉంటారట. అయితే ఈ సమస్య రావడానికి కారణం.. దగ్గరలో జరిగే యురేనియం మైనింగ్ అని తెలుస్తున్నది. అక్కడి నుంచి విడుదలయ్యే గ్యాస్ వల్లే ఇలా అకస్మాత్తుగా నిద్రలోకి జారుకుంటున్నట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే చాలామంది ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. అప్పటిదాకా ఆ ఊరి ప్రజలు అలా మత్తులో జోగాల్సిందే!

599
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles