ఉసిరితో సౌందర్యం


Thu,March 21, 2019 02:37 AM

ఎండలో తిరగాలంటే చర్మం గురించి చాలా బెంగగా ఉంటుంది. ప్రకృతి నుంచి లభించే ఉసిరికాయలకు చర్మ సమస్యలను నయం చేసే శక్తి ఉంది. ముఖం మీద మొటిమలు, మచ్చలను నిరోధించి చర్మాన్ని మెరిసేటట్టు చేస్తుంది.
amla
-ఉసిరికాయ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మంపై మొటిమలను తిరిగి రాకుండా చేస్తుంది.
-ఉసిరి రక్తాన్ని శుద్ధి చేసే సహజ పదార్థంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మంపై దాడి చేసే సూక్ష్మజీవులను నిర్మూలించి చర్మవ్యాధులను అరికడుతుంది.
-ఉసిరి రసంలో ఉండే యాంటిఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా చేసే నూతన కాంతినిస్తాయి. ఉసిరిక రసాన్ని చర్మానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది మేనిఛాయను తేలికపరిచి, మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది.
-ఉసిరిలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
-ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే నల్లని మచ్చలు, ముడుతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గుముఖం పడుతాయి.
-ప్రతిరోజూ ఉసిరికాయను ఉపయోగించడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తేలికగా తగ్గించవచ్చు. ఉసిరికాయలో సమృద్ధిగా ఉండే యాంటిఆక్సిడెంట్ల వల్ల మంచి ఔషధంగా పనిచేస్తుంది.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles