ఉప్పు తినకపోతే ముప్పేనట!


Wed,May 15, 2019 01:16 AM

మితం.. ఎప్పుడైనా హితమే. దేని వినియోగమైనా హద్దు మీరితేనే దాని దుష్ప్రభావం మన మీద పడుతుంది. ఈ సూత్రం ఉప్పుకు కూడా వర్తిస్తుంది. రోజూ ఆహారంలో ఎంత ఉప్పు తీసుకుంటే మంచిది? మొత్తానికే తీసుకోకపోవడం వల్ల నష్టాలేంటో తెలుసా?
salt
మన ఆరోగ్యానికి ఉప్పు అతిగా తింటే పెద్ద ముప్పు. దీని వల్ల ఎన్నో దుష్పరిణామాలున్నాయి. అలాగని ఉప్పును పూర్తిగా దూరం చేయడం వల్ల కూడా ఎన్నో దుష్పరిణామాలున్నాయి. ఉప్పు కూడా మన శరీరానికి, జీవక్రియలకు అవసరమైన వనరు. ఆరోగ్యవంతులు రోజుకు కాస్త అటూ ఇటుగా 4 గ్రాముల ఉప్పు తీసుకోవడం మంచిదట. చాలామంది శరీరానికి కావాల్సిన సోడియం అంతా కూడా కూరగాయలు, ఆహార పదార్థాల నుంచి సహజంగానే వచ్చేస్తుందనీ, ఇంకా అదనంగా ఉప్పు వేయడం వల్ల దాని పరిమితి పెరిగిపోతుందని చెబుతుంటారు. కానీ నిజానికి ఆహారం కాకుండానే 4 గ్రాములు అదనంగా(యాడెడ్ సాల్ట్ ) తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత (బ్యాలెన్స్) సజావుగా ఉండడానికి, మనం డీహైడ్రేషన్‌కి లోనుకాకుండా ఇది చాలా కీలకంగా పనిచేస్తుందట. దీనర్థం ఉప్పు ఎక్కువగా వాడమని కాదు. ఉదాహరణకు హైబీపీ ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులున్నవాళ్లు ఉప్పు తగ్గించుకోవడం అవసరం. అంతేగానీ ఆరోగ్యవంతులు అస్సలు ఉప్పును పెద్ద శత్రువులా అభిప్రాయపడుతూ, ఉప్పు లేకుండా తినడం సరికాదు అనేది నిపుణులు చెబుతున్న మాట.

197
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles