ఉపాసన కొత్త అవతారం!


Sun,April 14, 2019 01:04 AM

Samantha-Upasana
ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఓ వైపు తన వ్యాపారాలు, కుటుంబాన్ని చూసుకుంటూనే సోషల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ యంగ్ బిజినెస్ ఉమెన్ ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ కొత్త అవతారం ఎత్తారు. స్టార్ వైఫ్‌గానే కాదు.. అపోలో ఫౌండేషన్ ఎండీగా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు ఉపాసన. ఈ క్రమంలో అపోలో ఆధ్వర్యంలో నిర్వహించే బీ పాజిటివ్ హెల్త్ అండ్ లైఫ్ ైస్టెల్ మ్యాగజైన్‌కి చీఫ్ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు చూస్తున్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఉపాసన తన లైఫ్‌ైస్టెల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. వ్యాయామాలు చెయ్యడం, కొత్త రెసిపీలు వండడం, ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలు నెటిజన్లతో పంచుకోవడం తనకు అలవాటు.

అంతేకాకుండా ఇతర సెలెబ్రిటీల ఆరోగ్య వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా చెప్తుంటారు. ఈ క్రమంలో చీఫ్ ఎడిటర్‌గా మొదటిసారి సమంతను ఇంటర్వ్యూ చేశారు ఉపాసన. ఇందుకోసం సామ్‌తో కలిసి ఫొటోషూట్ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ టీజర్ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇది నెట్టింట బాగా వైరల్ అవుతున్నది. ఇంతకుముందు ఈ మ్యాగజైన్ కవర్‌పై హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, రామ్ చరణ్, షాహిద్ కపూర్, అలియా భట్, కృతి సనన్ వాళ్లందరూ కనిపించారు.

552
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles