ఉపవాసం మంచిదే!


Mon,February 4, 2019 11:43 PM

చాలామంది వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటుంటారు. ఏదీ తినకుండా అలా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం అని కొందరంటే.. వారంలో ఒకరోజు కడుపును డ్రైగా ఉంచడం శ్రేయస్కరమే అని మరికొందరు అంటుంటారు. దీంట్లో ఏది నిజం?
Fasting
ఉపవాసం వల్ల శరీరంలో జీర్ణక్రియ విశ్రాంతి తీసుకొని ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఉపవాసం వల్ల మెటబాలిజం సరిగ్గా ఉంటుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు. ఈ అంశంపై వాళ్లు ఒక అధ్యయనం చేశారు. వారంలోగానీ.. పక్షంలోగానీ ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆయుష్షు కూడా పెరుగుతుందని చెప్పారు. ఆహారం పూర్తిగా మానేసి అవసరమైనప్పుడు నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత మెరుగవుతాయి. ఎప్పుడు చూసినా యాక్టివ్‌గా కనిపిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు.. జలుబు లాంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. కాబట్టి ఉపవాసం గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాటించాలి అంటున్నారు నిపుణులు.

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles