ఉన్నత నగరాలు..


Fri,April 26, 2019 12:47 AM

city
ఒక నగరం ఉన్నతమైనది. వసతుల్లో అన్నింటా ముందున్నది అని చెప్పడానికి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పట్టణ జనాభా నుంచి మొదలు కనీస అవసరాలు అక్కడి అభివృద్ధి, పర్యాటకం వంటి చాలా అంశాలుంటాయి. అలాంటి అన్ని అంశాల్లో ముందున్నాయి ఈ నగరాలు. పేదవాళ్లయినా, ధనవంతులైన, పర్యాటకులైనా, విదేశీయులైనా జీవించడానికి వీలున్న ప్రదేశాలుగా పేరుగాంచాయి. ప్రపంచంలో మంచి నగరాల లిస్ట్‌లో స్థానం సంపాదించాయి ఢిల్లీ, ముంబై. అత్యున్నత వసతులున్న 48 నగరాల జాబితాలో ఢిల్లీ 22, ముంబై 37వ స్థానాలను కైవసం చేసుకున్నాయి. న్యూయార్క్, మెల్‌బోర్న్, చికాగో వంటి నగరాల సరసన చేరాయి. సంస్కృతి, రెస్టారెంట్స్, పర్యాటక ప్రదేశాలు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని 34 వేల పట్టణ నివాసితులను పలు ప్రశ్నలు అడిగి ఈ సర్వే నిర్వహించారు. న్యూయార్క్ పట్టణం ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. మెల్‌బోర్న్ బెస్ట్ లైవ్ మ్యూజిక్, చికాగో మంచి ఆహారం, జీవన విధానం, లండన్ సృజనాత్మకత, ప్రశాంతత వంటి అంశాల్లో వరుసగా నిలిచాయి.

129
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles