ఉత్తమ పర్యాటక ప్రదేశం


Fri,March 1, 2019 01:28 AM

ఒక రాష్ట్రం నిరంతరంగా భారతదేశంలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా, పర్యాటక గమ్యస్థానంగా విరాజిల్లుతున్నది. అది ఏదో చెప్పగలరా?
STUDY
ఠక్కున కేరళ, గోవా, జమ్ముకశ్మీర్ అని చెప్పేస్తారు. కానీ కాదు. తమిళనాడు ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా విలసిల్లుతున్నది. 2016 నుంచి ఇప్పటివరకు దాదాపు 344 మిలియన్ల పర్యాటకులు తమిళనాడుని సందర్శించారని ఒక అంచనా. పర్యాటకంలో మొదటి స్థానాన్ని గత ఐదేళ్లుగా సుస్థిరపరుచుకుంటూ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతున్నది. ప్రకృతి పరంగా, ఆలయాల కట్టడాల పరంగా అన్ని విషయాల్లో తమిళనాడులో మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయి. చెన్నై వంటి 20 కన్నా ఎక్కువ చారిత్రక నేపథ్యం కలిగిన నగరాలున్నాయి. గుడులున్నాయి. గోపురాలున్నాయి. భారతదేశానికి రావాలనుకుంటున్న విదేశీయులు ముందు తమిళనాడును సందర్శించాలని ఇష్టాన్ని వ్యక్తీకరిస్తున్నారట. హిల్‌స్టేషన్స్, వాటర్‌ఫాల్స్, టెంపుల్స్ ఇలా ఏ విషయంలోనైనా మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తమిళనాడు బెస్ట్ అని టూరిస్టులు అభిప్రాయపడుతున్నారని టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

430
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles