ఉక్కపోతలో.. కాటన్ కళ!


Fri,April 12, 2019 01:26 AM

అక్కడక్కడా.. అడపాదడపా..చిరుజల్లులు అలా అలా పలుకరిస్తున్నా.. గుచ్చే వేసవి మాత్రం రోజంతా చంపేస్తున్నది..చెమటలు కక్కేలాంటి ఈ వేసవిలో.. కాటన్‌కి మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు.. అందుకే కళాత్మకమైన ఆ కలెక్షన్ మీ కోసం..
Fashan
1. సంబుల్‌పురీ చీర ఈ సమ్మర్‌లో చాలా కూల్‌గా ఉంటుంది. ఆకుపచ్చని చీరకు తెల్లని బుటీ వచ్చింది. నల్లని, తెల్లని కాంబినేషన్‌లో వచ్చిన బార్డర్, పోచంపల్లి డిజైన్‌తో వచ్చిన పల్లూ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

2. చెక్స్ ప్యాటర్న్ చీరలు ఎప్పటికీ ప్రత్యేక లుక్‌ని తీసుకొస్తాయి. ఆరెంజ్ కలర్ సంబుల్‌పురీ చీర ఇది. బార్డర్‌కి వచ్చిన ఏనుగుల డిజైన్, చీర మొత్తం వచ్చిన పువ్వుల డిజైన్స్ చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.

3. బూడిద రంగులోని సంబల్‌పురీ కాటన్ చీర ఇది. దీనికి ఎరుపు, నలుపు కలిసిన ఇక్కత్ నేతతో వచ్చిన బార్డర్ చూడముచ్చటగా కనిపిస్తున్నది. తుమ్మెదల డిజైన్ వచ్చిన పల్లూ దీనికి కూల్ లుక్ తెచ్చి పెట్టింది.
Fashan1
4. కాటన్‌లో చాలా రకాలుంటాయి. సాఫ్ట్ కాటన్‌తో వచ్చిన చిలుకపచ్చ చీర ఇది. చీర మొత్తం ఇక్కత్ డిజైన్‌తో నిలువుగా లైన్స్ వచ్చాయి. దీనికి గోల్డెన్ జరీ బార్డర్ మిక్స్ అయింది. ఇక్కత్ డిజైన్ వచ్చిన పల్లూ మరింత సూపర్‌గా కనిపిస్తున్నది.

5. రాధా కృష్ణులంటే ప్రేమకు ప్రతిరూపాలు. ఆ ప్రతిరూపాలను చీర మీద చిత్రిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఎర్రని సౌత్ ఇండియన్ కాటన్ చీర ఇది. చీర మొత్తం రాధాకృష్ణులే కనిపిస్తారు. వెండి జరీలా వచ్చిన పల్లూ చీర అందాన్ని రెట్టింపు చేసింది.

-కామాక్షి మహంకాళి
-ఫౌండర్/చైర్మన్
www.vynam.com
-లార్జెస్ట్ సిల్క్ అండ్
-హ్యాండ్‌లూమ్ కలెక్షన్స్
-ఫోన్: 8296848484 , 9000564333

363
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles