ఈ హోలీకి ఎకోఫ్రెండ్లీ రంగులు!


Mon,March 18, 2019 12:54 AM

మీకు తెలుసా? రసాయనాలతో తయారు చేసిన రంగులతో ఎన్నో రోగాలు వస్తున్నాయి. వాటిల్లో చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్, ఆస్తమా, అంధత్వం, మూత్రపిండ వ్యాధులు ఉన్నాయి. అలాగని హోళీ ఆడకుండా ఉండలేం కదా? మరెలా? అంటే.. ఈ సమస్యకు సేంద్రియ రంగులే పరిష్కారం అంటున్నది ఈ యువతి.
Janaki
పుణేకు చెందిన జానకి జతర్ నరాల్కర్ అనే ఈ యువతి ఈ హోలీకి సేంద్రియ రంగులు వాడమని సలహా ఇస్తున్నది. కారణం కెమికల్ రంగులు వాడి తానూ బాధితురాలిగా మారడమే. 2007లో హోలీ ఆడుతుండగా.. తన స్నేహితులు ముఖానికి బాగా రంగులు చల్లారు. కొంచెం దురదగా ఉండడంతో అద్దంలో చూసుకుంది. ముఖం మొత్తంగా ఎర్రగా కందిపోయి దద్దుర్లు వచ్చాయి. ఒళ్లంత పాకడంతో ఆస్పత్రి పాలైంది. ఆ తర్వాత ఆ రంగుల గురించి ఆరా తియ్యగా నమ్మలేని నిజాలు తెలిశాయి తనకు. టాక్సిక్ కెమికల్స్ అయిన కాపర్ సల్ఫేట్, అల్యూమీనియం బ్రోమిడ్, జింక్, ఆస్బెస్టాస్, పాదరసం స్థాయిలు ఆయా రంగుల్లో ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు తెలుసుకుంది. అప్పుడే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాస్మిటాలజీ చదవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతిలో తయారవుతున్న ఎకో ఫ్రెండ్లీ రంగులను వాడమని సూచిస్తున్నది జానకి. ప్రస్తుతం పుణేలోని కాస్మిటాలజీ చదువుతున్న జానకి.. ఏ శుభకార్యానికైనా ఎకోఫ్రెండ్లీ రంగులనే వాడుతున్నది. వీటిల్లో ఉత్తమమైనవి ఎకో ఎగ్జిట్, గుల్‌మెహర్ బ్రాండ్ ఉత్పత్తులు. రసాయనాలతో తయారు చేసిన రంగులతో ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలని చెబుతున్నది. ఎకో ఫ్రెండ్లీ రంగులతో ఎలాంటి కీడు జరుగదని ప్రచారం చేస్తున్నది జానకి.
Janaki1

364
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles