ఈ-సైకిల్ ప్రత్యేకం


Wed,February 20, 2019 03:19 AM

గోవాకు చెందిన కొందరు యువకులు పర్యాటకులకు ఈ సైకిల్స్ తయారు చేశారు. వివిధ రకాల కారణాల వల్ల టూరిస్టులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వారు అనూహ్యంగా ఆలోచించారు.. e-cycle
దేశీయులకే కాకుండా విదేశీయులకూ ఇష్టమైన ప్రాంతం గోవా. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఎన్ని ఉన్నా రవాణా సౌకర్యం లేకనో, ఎత్తయిన కొండల మధ్య వాహనం వెళ్లలేకనో, వాతావరణ కారణాల వల్లనో వాటిని చూడలేకపోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లు గమనించారు. మరోవైపు గోవాకు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుంటారు కాబట్టి ట్రాఫిక్ చిక్కులూ తప్పవు. వాహనాల రద్దీ వల్ల సందర్శకులకు, వాతావరణానికి ఇబ్బందులూ తప్పవు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పారు సందీప్, సమర్థ్ అనే ఇద్దరు యువకులు. గోవా కేంద్రంగా టూరిస్టుల కోసం ఈ-సైకిళ్ల హబ్‌ను బి-లైవ్ పేరుతో ప్రారంభించారు.


e-cycle2
గోవాకు వస్తున్న టూరిస్టులకు ఈ ఎలక్ట్రానిక్ సైకిళ్లను అద్దెకు ఇచ్చి సందర్శకుల సమస్యలను తీర్చి, వాతారణ కాలుష్య నివారణకు కృషి చేస్తున్నారు. ఈ సైకిళ్లతో ఎత్తయిన కొండలపైకి, అటవీ ప్రాంతాలకు వెళ్లొచ్చు. గోవా టూరిస్ట్ అథారిటీతో కలిసి ఈ హబ్‌ను నడిపిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సైకిల్ అద్దె వెయ్యి నుంచి రెండు వేల వరకూ ఉంటుంది. జీపీఎస్, మ్యాప్స్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంచారు. బుకింగ్ కోసం బీ-లైవ్ అఫీషియల్ వెబ్‌సైట్, గోవా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లను సంప్రదించవచ్చు.

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles