ఈ-వెహికిల్స్ సృష్టికర్త!


Mon,March 18, 2019 12:58 AM

మన దేశంలో ఈ-వెహికిల్స్ తిరుగుతున్నాయంటే కారణం ఈమెనే. ఆధునిక టెక్నాలజీతో పరుగెత్తే ప్రపంచంతో.. తానూ పోటీ పడింది. కాలుష్య రహిత వాహనాలను రూపొందించి.. ఆటోమ్బైల్ రంగంలో తానొక సంచలనంగా మారింది.
Hemalatha-Annamalai
తమిళనాడలోని కోయంబత్తూర్‌కు చెందిన హేమలత అన్నమలై ఆటోమొబైల్ రంగంలో సంచలంగా మారారు. కేవలం పురుషులకే పరిమితమనుకున్న ఆటోమొబైల్ రంగంలో అడుగుపెట్టి.. పెద్దపెద్ద విజయాలు సాధించారు. ఆంపియర్ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి.. అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశారు. 2007లో ఆటోమొబైల్ రంగంలో ఎంట్రపెన్యూవర్‌గా అడుగుపెట్టారు హేమలత. భర్త బాల పచ్యాప్పా జపాన్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో భార్య హేమలత గురించి చెప్పాడు. వారి పిలుపు మేరకు జపాన్ వెళ్లిన హేమలత.. అక్కడ కొత్త టెక్నాలజీపై అధ్యయనం చేశారు. ఇంధనాలతో నడిచే ఇంజిన్ల శకం ముగుస్తుంది కనుక.. ఈ స్మార్ట్ కాలంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆవిష్కరణలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల పరిశోధన తర్వాత.. జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ మొబిలిటీ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం అందుకున్నారు.

దాని తర్వాత ఈ-వెహికిల్స్‌ను ఇండియాలో ప్రవేశపెట్టాలని ఆలోచన చేశారు హేమలత. 18 యేండ్లపాటు సింగపూర్‌లో పనిచేసిన అనుభవంతో కోయంబత్తూర్‌లో ఆంపియర్ ఈ-వెహికిల్స్ కంపెనీని ప్రారంభించారు. నిపుణులైన సిబ్బందిని తన కంపెనీలో ఉద్యోగులుగా తీసుకొని.. అనతి కాలంలోనే భారతదేశపు రోడ్లపై ఈ-వెహికిల్స్‌ను తిప్పారు హేమలత. ఇంజినీరింగ్ పూర్తైన విద్యార్థులకు వీలైనంత ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంపియర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ-సైకిల్, ఈ-స్కూటర్లు, ఈ-ట్రాలీస్‌తో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తున్నారు. తన కంపెనీలో మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతం 40శాతం మంది మహిళలు ఆంపియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తాను కంపెనీ స్థాపించినప్పుడే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన కంపెనీలో లింగ భేదాలు ఉండకూడదనేది హేమలత సంకల్పం. తన ఆవిష్కరణలకు ఎన్నో అవార్డులు, రివార్డులు, అభినందనలు, ప్రశంసలు అందాయి.

430
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles