ఈ బెంగ తీర్చగలరా?


Tue,August 15, 2017 11:42 PM

నా వయసు 24 సంవత్సరాలు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంకా పెళ్లి కాలేదు. ఈ మధ్య నా తల మాడు మీద జుట్టు ఎక్కువగా రాలుతున్నది. చాలా రకాల నూనెలు, షాంపులు మార్చి చూశాను. కానీ పెద్దగా ఫలితం లేదు. నాకు ఈ విషయం చాలా బెంగ కలిగిస్తున్నది. ఇలా జుట్టు రాలడం వల్ల నా వయసు కంటే పెద్దవాడిలా కనిపిస్తున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
విజయ్, హైదరాబాద్

BALDNESS
ఇలా జుట్టురాలే సమస్యకు నూనెలు, షాంపులు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలా జరుగడానికి అంతర్గత కారణాలు ఏమున్నాయో నిపుణులు పరీక్షించి నిర్ధారించాల్సి ఉంటుంది. సంపూర్ణ సమతుల ఆహారం తీసుకుంటున్నారా లేదా? మీరు తీసుకుంటున్న ఆహారం, మీ ఒత్తిడి వంటివన్నీ ఇందుకు కారణం కావొచ్చు. అంతేకాదు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి, థైరాయిడ్ హార్మోన్ స్థాయి వంటి వాటినన్నింటినీ పరీక్షించి, ఆ రిపోర్టుల ఆధారంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకు మినోక్సిడిల్ సిరంలతో పాటు ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు ఏది అవసరమవుతుందనేది నిపుణులు నిర్ధారిస్తారు. మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది.
Drkavitha

513
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles