ఈ ఫిట్స్ ఎందువల్ల?


Thu,June 8, 2017 12:02 AM

మా బాబుకు రెండు సంవత్సరాలు. ఒకసారి జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఫిట్స్‌కూడా వచ్చాయి. ఆ స్థితి 2 నిమిషాల పాటు ఉంది. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్‌లో చికిత్స ఇప్పించాము. అయితే నాకు అది తలచుకున్నపుడల్లా చాలా భయంగా ఉంటున్నది. తనకు ఎప్పుడు జ్వరం వచ్చినా ఇలా జరుతుందా? దీనికి దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుందా? రోహిణి, నర్సంపేట
KID-FEVER
చిన్న పిల్లల్లో జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు పిట్స్ వస్తాయి. వీటిని ఫెబ్రిలేసీజర్స్ అంటారు. ఇలా 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో జరిగే ఆస్కారం ఉంటుంది. ఈ రకమైన ఫిట్స్ గరిష్టంగా 5 నిమిషాల పాటు ఉంటాయి. తర్వాత తగ్గిపోతాయి. ఇవి సాధారణంగా నాడీ వ్యవస్థలో ఏర్పడే లోపాల వల్ల వచ్చే ఫిట్స్ అంటే ఎపిలెప్సి వంటివి కాదు. ఇలా జరుగకుండా ఉండాలంటే జ్వరంగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత మరీ పెరిగిపోకుండా తడిగుడ్డతో శరీరాన్ని తుడువాలి.
drvis
వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఇందుకు కావాల్సిన మందులూ ఉంటుంది. దీనివల్ల సాధారణంగా పిల్లల మానసిక శారీరక ఎదుగుదల మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఇలా జ్వరం వచ్చిన ప్రతిసారీ జరుగుతుందని కూడా చెప్పలేం. కానీ జ్వరం వచ్చిన మొదటి రెండు రోజుల పాటు ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వడం మంచిది. దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉండదు. ఇది 5 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దానంతటదే తగ్గిపోతుంది. దీని గురించి పెద్దగా బెంగ పడాల్సిన పనిలేదు.

566
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles