ఈ నడుంనొప్పికి సర్జరీ తప్పదా?


Mon,January 14, 2019 01:34 AM

నా వయసు 45 సంవత్సరాలు. మూడు నెలలుగా నడుమునొప్పితో బాధపడుతున్నాను. పది రోజులుగా బాగా ఇబ్బంది పడుతున్నా. నొప్పి కారణంగా ఎటూ కదలలేకపోతున్నా. నడుం నుంచి పాదాల వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. మూడు రోజులుగా మూత్రం కూడా ఆగి ఆగి వస్తున్నది. ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించాం. దానిని చూసిన వైద్యులు సర్జరీ అవసరం అంటున్నారు. కొంతమంది వద్దంటున్నారు. సర్జరీ చేయించుకుంటే కాలు పడిపోయే ప్రమాదం ఉందని మా కొలీగ్స్ అంటున్నారు. నాకు భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు.
- కౌశిక్‌రావు, మెహదీపట్నం

Counling
మీరు L5/S1 రేడిక్యులోపతితో బాధపడుతున్నారు. అయితే నొప్పి మాత్రమే ఉన్నవారిలో, నడుముకి బెల్ట్ వేసుకోవడం, మందులు వాడడం, తగినంత రెస్ట్ తీసుకోవడంతో 80 శాతం మందికి నొప్పి తగ్గుతుంది. మిగిలిన వారికి సర్జరీ అవసరం అవుతుంది. కాళ్లకు సంబంధించిన నరాలు మల, మూత్ర విసర్జనకు అవసరమైన నరాలు అన్నీ నడుము నుంచే కిందకు వెళతాయి. అయితే నడుము బొక్కలు అరిగినప్పుడు డిస్క్‌లు బయటికి జారి, నరాలు ఒత్తుకోవడం వల్ల నడుము నొప్పి, తిమ్మిర్లు, మూత్రంలో ఇబ్బంది ఏర్పడుతాయి. ఇలా జరుగుతుందంటే.. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లే. సమయం వృథా చేసున్న కొద్దీ పరిస్థితి మరింత జఠిలమవుతుంది. మీరు చెబుతున్నదానిని బట్టి చూస్తే.. మీకు కచ్చితంగా సర్జరీ చేయాలి. సరైన న్యూరో సర్జన్‌తో ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇప్పుడు మైక్రోస్కోప్ ద్వారా కేవలం గంటకన్నా తక్కువ సమయంలోనే సర్జరీ చేసే సదుపాయాలు ఉన్నాయి. మూడు రోజుల్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్లొచ్చు. అయితే మంచి ఆస్పత్రిలో న్యూరో సర్జరీ లేదా స్పైన్ సర్జన్‌తో ఆపరేషన్ చేయించుకోవాలి.

డాక్టర్ మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.

978
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles