ఈ కుక్కకు ఓ రోజొచ్చింది!


Thu,January 31, 2019 12:29 AM

dog
మనుషులలాగే జంతువులకు కూడా సరైన శిక్షణ ఇస్తే ఏ పనైనా చేస్తాయనడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. రికార్డులంటే కేవలం మనుషులే కాదు.. కుక్కలు కూడా సృష్టిస్తాయని నిరూపించిందీ కుక్క. అసలు విషయమేంటంటే...


ఒక కుక్క గాలి బుడగలను పగులగొట్టడంలో విశేషమేముందని మీకు సందేహం రావొచ్చు. కానీ ఈ కుక్క అతితక్కువ సమయంలో 100 గాలి బుడగలను పగులగొట్టి గిన్నిస్ రికార్డ్ కెక్కింది. గోల్డెన్ విప్పెట్ జాతికి చెందిన తొమ్మిదేండ్ల టాబి బెలూన్లు పగులగొట్టే పోటీలో పాల్గొన్నది. అంతకు ముందు 36.53 సెకన్ల వ్యవధిలో ఓ కుక్క వంద బుడగలు పగులగొట్టింది. టాబి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 28.22 సెకన్లలోనే వంద బుడగలు పగులగొట్టింది. ప్రపంచంలో ఇదే రికార్డు అయినందున గిన్నిస్‌బుక్‌లో ఎక్కింది. కెనడాకు చెందిన క్రిస్టీ అనే మహిళ టాబిని పెంచుకుంటున్నది. చిన్నప్పటి నుంచి టాబికి రకరకాల పనుల్లో ట్రైనింగ్ ఇచ్చింది. బెలూన్లను పగులగొట్టడంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. అందుకోసం ప్రతిరోజూ ఈత కొలనులో బెలూన్లు వేసి టాబితో ఎలా పగులగొట్టాలో నేర్పించింది. ఈ రికార్డు నెలకొల్పడం కోసం టాబి చాలా శ్రమించిందని క్రిస్టి చెబుతున్నది. తమ ప్రాంతంలో టాబి ఇప్పడు పెద్ద సెలెబ్రిటీగా మారిందని, తనను చూడడానికి చాలామంది క్యూ కడుతున్నారంటున్నది క్రిస్టీ.

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles