ఈ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం బెస్ట్!


Wed,December 9, 2015 12:35 AM

పదేళ్లుగా సొరియాసిస్‌తో బాధ పడుతన్న ఆమె వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు. ఈ మధ్య నాలుగేళ్లుగా సొరియాటిక్ ఆర్థరైటిస్ కూడా బాధిస్తోంది. తొలుత తల నుంచి మొదలైన సొరియాసిస్ రెండేళ్లలో మొత్తం శరీరమంతా పాకింది. ఆ తర్వాత రెండేళ్లలో కీళ్లలో నొప్పి మొదలైంది. నొప్పితో పాటు ఉదయం వేళల్లో కీళ్లు బిగుసుకు పోవడం కీళ్లలో వాపు కనిపించాయి. అరిచేతుల కీళ్లు, అరికాళ్ల కీళ్లలో మడమల్లో కూడా వాపు వచ్చింది. దీని వల్ల నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల కాలివేళ్లు, చేతి వేళ్లు వంకర్లు పోవడం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఆమెకు తన వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందన్న నమ్మకం ఏ కోశానా లేదు. సమస్యలతో విసిగిపోయి జీవితం మీద ఆసక్తి కూడా సన్నగిల్లింది.

ayurveda_schweiz


ముందుగా ఆమెకు విరేచన చికిత్స చేసి ఆ తర్వాత వైతరణ చికిత్స వస్తి చికిత్స అందించాము. ఈ చికిత్సను వరుసగా 20 రోజుల పాటు కొనసాగిస్తే ఉదయం వేళల్లో కీళ్లు బిగుసుకు పోవడం, కీళ్ల వాపు నొప్పి తగ్గిపోయాయి. ఎన్ని వైద్య చికిత్సలు చేసినా ఒకసారి వేళ్లు వంకర్లు పోతే ఇక వాటిని తిరిగి యథా స్థితికి తీసుకురావడం సాధ్యం కాదు. కానీ కీళ్లలోని వాపు, నొప్పి తగ్గిపోతే ఆ వంకర్ల వల్ల అంత పెద్ద సమస్యేమీ ఉండదు. ఇక ముందు పరిస్థితి మరింత దిగజారకుండా నివారించవచ్చు. ఆమెకు చేసిన వైతరణ వస్తి, పంచకర్మ చికిత్సల వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. కాలు కదపలేని స్థితిని దాటి ఇప్పుడామె తన పనులన్నీ తానే చేసుకోగలుగుతోంది. చికిత్స ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆమె శరీరం మీదునన మచ్చలన్నీ పూర్తిగా మాయమైపోయాయి.

ఎవరిలో ఎక్కువ..


సొరియాసిస్ శరీరమంతా వ్యాపించిన తర్వాతే సొరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుందని అనుకోనక్కర్లేదు. కొందరికి ఒంటి మీద సొరియాసిస్ మచ్చలేవీ కనిపించకుండానే సొరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు. కేవలం తల మీదే సొరియాసిస్ కనిపించి ఒకటి రెండు మాసాల్లోనే సొరియాటిక్ ఆర్థరైటిస్ మొదలు కావచ్చు.

మౌలింకంగా సొరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వాత ప్రకోపం వల్ల తలెత్తే సమస్య కాబట్టి దానికి వస్తి ప్రధాన చికిత్సే అయినా అంతకు ముందే వమన కర్మతో కఫాన్ని నియంత్రించాలి. విరేచన కర్మద్వారా పిత్తాన్ని నియంత్రించాలి. పిత్తాన్ని నియంత్రించే క్రమంలో సహజంగానే వాతహరణం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వస్తి కర్మ చేస్తే దాని వల్ల పరిపూర్ణ ఫలితాలు వస్తాయి. వమన కర్మ చేసినపుడు కఫం కారణంగా వచ్చే వాపు, దురద కూడా తగ్గుతాయి. వస్తి చికిత్స వల్ల నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. కొంత మందిలో సొరియాసిస్ తిరగి రావచ్చు. కానీ సొరియటిక్ ఆర్థరైటిస్ మాత్రం 95 శాతం మందిలో తిరిగి రాదనే చెప్పవచ్చు. తిరిగి వచ్చే 5 శాతం మందిలో కూడా వాతావరణ పరిస్థితులు, సముద్రపు చేపలను అధికంగా తీసుకోవడం వంటివి కారణం కావచ్చు.

ఇతర సమస్యలకు కూడా...


ravikumar


సొరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య తిరిగి రాకుండా ఉండడానికి ఏడాదికి రెండు మూడు సార్లు విరేచన కర్మ చేయించుకోవాలి. అలాగే సొరియాసిస్ శరీర అంతర్భాగాల్లోకి వెళ్లినపుడు తలెత్తే లివర్, కిడ్నీ, గుండె, మెదడు సమస్యలు రాకుండా ముందే నియంత్రించినట్లవుతుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చిన వారిలో ఆ తర్వాత థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధుమేహ లక్షణాలు కూడా ఎక్కువ మందిలోనే కనిపిస్తున్నాయి. అందువల్ల ముందే వైతరణ వస్తి చికిత్సలు తసీఉకోవడం వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్‌ను మాత్రమే కాకుండా దాని మూలంగా వచ్చే థైరాయిడ్ మధుమేహాలను కూడా నిలువరించే అవకాశం ఉంటుంది.

2721
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles